Begin typing your search above and press return to search.

తెలంగాణా సహకరించేది అనుమానమే

By:  Tupaki Desk   |   20 Sep 2022 1:30 AM GMT
తెలంగాణా సహకరించేది అనుమానమే
X
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన చట్టంలోని వివాదాల పరిష్కారానికి ఈనెల 27వ తేదీన ఢిల్లీలో సమావేశం జరగబోతోంది. సమావేశంలో పాల్గొనాలని రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శులు తదితర ఉన్నతాధికారులను కేంద్రం ఆదేశించింది. హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన కీలకమైన సమావేశం జరగబోతోంది. వివాదాల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ చొరవచూపించటం నిజంగా సంతోషించాల్సిన విషయమే. అయితే ఇందుకు తెలంగాణా సహకరిస్తుందా ?

ఈ అనుమానం ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన సమావేశాలకు తెలంగాణా పెద్దగా సహకరించలేదు కాబట్టే. విద్యుత్ రంగంలో ఏపీకి తెలంగాణా ప్రభుత్వం చెల్లించాల్సిన రు. 6500 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించమని నెలరోజుల క్రితమే కేంద్రం ఆదేశించింది.

అయితే ఈ ఆదేశాలను తెలంగాణా ప్రభుత్వం పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా ఏపీనే తమకు రు. 16700 కోట్లు చెల్లించాలని అందులోనుండి రు. 6500 కోట్లు మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలంటు కేసీయార్ అసెంబ్లీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

విభజన చట్టం ప్రకారం నడుచుకోకుండా తెలంగాణా ప్రత్యేకించి హైదరాబాద్ చుట్టుపక్కలున్న అన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్ధలన్నీ తమవే అని కేసీయార్ ఏకపక్షంగా సొంతం చేసేసుకున్నారు. సంస్ధలను తరలించటం సాధ్యం కాదుకాబట్టి వాటి మార్కెట్ విలువలో ఏపీకి షేర్ ఇవ్వాలని కమిటి చెప్పినా లెక్కచేయలేదు. ఇదే పద్దతిలో ఏ విషయంలో అయినా సరే కేసీయార్ ఏకపక్ష నిర్ణయాలతో ఏపీకి చాలా నష్టం జరిగింది.

ఇంతకాలం చోద్యం చూసిన కేంద్రం ఇపుడు హఠాత్తుగా మేల్కొన్నది. నరేంద్ర మోడీకి కేసీయార్ వ్యతిరేకమైన తర్వాత విభజన చట్టంలోని వివాదాల పరిష్కారమంటు కేంద్రం కొత్త పాటందుకుంది. దీనికి కూడా కేసీయార్ సానుకూలంగా స్పందించేది అనుమానంగానే ఉంది.

ఎందుకంటే సమస్యలను పరిష్కరించుకోవాలని కేసీయార్ కు లేదు. కారణం ఏమిటంటే వివాదాల పరిష్కారం కోసం ఏపీకి తెలంగాణా ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సుమారు రు. 4 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నందుకే తెలంగాణా ప్రభుత్వం ఏపీకి బకాయిలు చెల్లించటానికి ఇష్టపడటంలేదు. ఇందుకనే సమావేశాల్లో తెలంగాణా ప్రభుత్వం సహకరించడం లేదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.