Begin typing your search above and press return to search.
'లెక్క' తప్పిన సారు.. తప్పులో కాలేసింది అందుకేనా?
By: Tupaki Desk | 28 Dec 2022 5:32 AM GMT"శివారెడ్డి చస్తే మీరు సీఎం అవుతారు. శివారెడ్డిని చంపితే మీరు నేరస్తులు అవుతారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు?" దాదాపు పదిహేడేళ్ల క్రితం విడుదలైన అతడు సినిమాలో పాపులర్ డైలాగ్ ఇది. ఏదైనా జరిగితే భారీ ప్రయోజనం ఉంటుంది. అలా అని దాని కోసం అడ్డదారి పడితే.. అడ్డంగా బుక్ అయిపోతారు. అందుకే.. ఏదైనా కోరుకోవటం తప్పు కాదు. అత్యాశకు వెళ్లటంతోనే అసలు ఇబ్బంది అంతా. వీటన్నింటికి మించి ఓవర్ కాన్ఫిడెన్స అస్సలు ఉండకూడదు.
తమకు మించినోళ్లు ఉండరన్న ఆలోచనే.. దెబ్బ పడటానికి తొలి అడుగు అవుతుందన్నది మర్చిపోకూడదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత తెలివైన వ్యక్తో.. ఎంతటి మేధావో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నింటికి మించిన తన రాజకీయ ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టి.. మూడు చెరువులు తాగించే విషయంలో ఆయనకున్న నేర్పుకు ఆయన ప్రత్యర్థులు సైతం ఫిదా అయిపోతుంటారు. అలాంటి కేసీఆర్ లెక్క తప్పేదే జరగదన్న మాట ఆయన సన్నిహితుల నోటి నుంచి తరచూ వినిపిస్తూ ఉంటుంది.
ఇక.. సీనియర్ ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు అయితే ఆయన్ను పొగడని రోజు అంటూ ఉండదు. కేసీఆర్ ప్లానింగ్ గురించి వారు ఆకాశానికి ఎత్తేస్తుంటారు. తాము ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని చూశామని.. వారందరితో పోలిస్తే కేసీఆర్ ది భిన్నమైన పంధాగా చెబుతారు. అలాంటి కేసీఆర్ లెక్క తప్పటమే కాదు.. ఇప్పుడు ఒక విషయంలో కిందా మీదా పడిపోతున్నట్లుగా చెప్పాలి. ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ కు సంబంధించి.. కేసీఆర్ ప్రదర్శించిన తొందరపాటు ఆయన్ను ఇప్పుడు ఇబ్బందులకు గురి చేయటమే కాదు.. తాను ఆశించిన దానికి భిన్నంగా జరుగుతున్న పరిస్థితి.
తమ పార్టీ ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసేందుకు బీజేపీ అధినాయకత్వం కుట్రలు పన్నిననట్లుగా పేర్కొనటమే కాదు.. దానికి సంబంధించిన ఆధారాలు ఇవేనంటూ మీడియాకు విడుదల చేయటమే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాల హైకోర్టులకు.. సుప్రీంకోర్టులకు పంపారు. ఇక్కడ కేసీఆర్ మిస్ అయిన పాయింట్ ఏమంటే.. ఒక తప్పు జరిగిందని చెప్పినప్పుడు.. దానికి సంబంధించిన వివరాల్ని సేకరించేది దర్యాప్తు సంస్థలు. ఆ సంస్థలకు భిన్నంగా ప్రభుత్వాధినేత చేతికి అలాంటి ఆధారాలు ఎలా వచ్చాయి? అందునా.. ఫోన్ సంభాషణలు దగ్గర నుంచి.. ఆడియో టేపుల వరకు.
అతడు సినిమాలో మాదిరి.. శివారెడ్డి చనిపోతే బాజిరెడ్డి ముఖ్యమంత్రి కావటానికి అవకాశం ఉంది. కానీ.. శివారెడ్డిని చంపితే ఆ నేరం బాజిరెడ్డి మీద పడుతుంది. నేరం చేసినోడు ఏ మాత్రం తప్పించుకోలేడు. అలాంటప్పుడు ఒకరు తప్పు చేశారని విరుచుకుపడే ముందు.. చట్టపరంగా తాను పొరపాటు చేయకూడదన్న చిన్న కాలిక్కులేషన్ కేసీఆర్ మిస్ అయ్యారన్న మాట వినిపిస్తోంది. ఎమ్మెల్యేల ఎర ఎపిసోడ్ లో విచారణ సంస్థలు చేయాల్సిన పనిని.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కీలక నేత ఎలా చేస్తారు? న్యాయ సంస్థలకు సమాచారాన్ని ఇవ్వాల్సింది విచారణ సంస్థలు. వారు ఇవ్వాల్సిన రిపోర్టులను ముఖ్యమంత్రే నేరుగా ఇవ్వటంపై ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తమవుతున్న పరిస్థితి.
ఇదంతా చూసినప్పుడు కాలిక్యులేషన్ విషయంలో తప్పు చేయని కేసీఆర్ తడబడటానికి కారణం ఆయనలో మితిమీరిన ఆత్మవిశ్వాసమే అన్న మాట వినిపిస్తోంది. దీనికి తోడు ఆయనకు థింక్ ట్యాంకర్లుగా వ్యవహరిస్తున్న వారి తీరు కూడా కారణమని చెబుతున్నారు. జరిగిన తప్పు జరిగిపోయింది. చేసేదేమీ లేదు. కాకుంటే.. ఇప్పటికైనా తన తప్పును కేసీఆర్ తెలుసుకొని మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.