Begin typing your search above and press return to search.

ఆకలి లేకున్నా తింటున్నారా? డేంజరే?

By:  Tupaki Desk   |   25 July 2020 11:30 PM GMT
ఆకలి లేకున్నా తింటున్నారా? డేంజరే?
X
టైమ్ పాస్ కోసం ఆకలేయకపోయినా తింటున్నారా.? సరదాగా స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో మునిగి తేలుతున్నారా.? అయితే మీకు రోగాలు ఖాయమని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా ఆకలిగా లేనప్పుడు తినే తిండి అనారోగ్యం కలిగిస్తుందని వైద్యులు తెలిపారు. ఆహారం తీసుకున్నప్పుడు గ్లూకోజ్ స్థాయిలను పరిశీలించడంతో ఈ విషయం వెల్లడైందని తెలిపారు. ఆకలి లేనప్పుడు సరదాగా తినే తిండి అనారోగ్యం పాలు చేస్తోందని వైద్యులు తెలిపారు.

అలాగే రోజుకు మూడు పూటలు మాత్రమే ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అల్పాహారం, భోజనం, రాత్రిపూట తప్పనిసరిగా ఆహారం తీసుకోవాలి. అదీ ఆకలి కలిగినప్పుడే తీసుకోవాలి. అదీ ఇంటి భోజనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. స్నాక్స్ గా కుకీస్, క్యాండీ బార్స్, ఐస్ క్రీమ్స్, చిప్సు తీసుకోకూడదు. ఆహారం తీసుకున్న తర్వాత 10 నుంచి 15 నిమిషాలు అలా కలియతిరిగాలి.

సాయంత్రం పూట సరదాగా ఎవరితోనైనా సన్నిహితులతో మాట్లాడాలి. అప్పుడప్పుడు సంగీతం వినడం, ఆడుకోవడం.. పిల్లలతో గడపడం ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తవు. అలాగే ఉద్వేగానికి లోనైనప్పుడు ఆహారం తీసుకోకూడదు. కోపంగా ఉంటే పది నిమిషాల తర్వాత కోపాన్ని నియంత్రించుకున్నాకే ఆహారం తీసుకోవాలి. అలా కాకుండా ఒత్తిడిలో అధిక ఆహారం తీసుకుంటే బరువు పెరిగి లావు అయిపోతారని వైద్యులు సూచిస్తున్నారు.