Begin typing your search above and press return to search.
టీవీ చానళ్ళదే బాధ్యత....సుప్రీం సీరియస్
By: Tupaki Desk | 22 Sep 2022 3:30 AM GMTటీవీ చానళ్ళకు అతి పెద్ద చెక్ పడింది. టీవీ ప్రసారాల్లో విద్వేషం పాళ్ళు ఉన్న ప్రసారాలు ఏ మాత్రం ఉన్నా కూడా అది చానళ్ళకే ప్రాబ్లం అవుతుంది. అందుకు యాంకర్లే బాధ్యులు అవుతారు. దేశ అత్యున్నత న్యాయ స్థానం దీని మీద సీరియస్ అవుతూ గట్టిగానే హెచ్చరికలు జారీ చేసింది.
ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం. పైగా సున్నితమైన అంశాలు ఎన్నో ఉంటాయి. సువిశాలమైన దేశంలో ఆసేతు హిమాచలంలో ఎక్కడో ఏదో ఒకటి జరిగిందో లేదో తెలియదు కానీ క్షణాలలో టీవీలలో దాని మీద ప్రసారాలు మొదలవుతాయి. ఇక దానికి తోడు ఈ తరహా ప్రసంగాలు చేసే వారు కూడా రెడీ అవుతారు.
ఒక విధంగా టీయార్పీ రేటింగ్ ఉచ్చులో పడి చానళ్ళు అన్నీ కూడ వేడిని ఎప్పటికపుడు క్యాష్ చేసుకోవడానికే చూస్తాయి. ఆ టైం లో సరైన మానిటరింగ్ కూడా ఉండదు అన్న విమర్శలు ఎపుడూ ఉన్నవే. దాంతో అగ్నికి వాయువు తోడు అయినట్లుగా విద్వేషం చిచ్చుకు ఇవి కూడా కారణం అవుతున్నాయన్న భావన అంతటా ఉంది.
ఇపుడు ఈ విషయాల మీదనే సుప్రీం కోర్టు దృష్టి పెట్టింది. దాంతో టీవీ ప్రసారాల మీద గట్టి ఆంక్షలు విధించింది. విద్వేషాన్ని వండి వార్చితే చూస్తూ ఊరుకోమని కూడా వార్నింగ్ ఇచ్చింది. ఏకంగా కఠిన చర్యలే తీసుకుంటామని స్పష్టం చేసింది.
ముఖ్యంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రసారాలు చేస్తే కనుక చూస్తూ ఊరుకోమని యాంకర్లనే బాధ్యులుగా చేస్తామని పేర్కొంది. ఈ తరహా ప్రసారాల వల్లనే సమాజంలో విద్వేషాలు పెరిగిపోతున్నాయని కూడా సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
చాలా మంది నాయకులు టీవీలలో మత పరమైన విద్వేషాలు చేస్తున్నారని, వాటిని ప్రసారం చేస్తున్నారని కూడా పేర్కొంది. మొత్తానికి విద్వేషం మీద అడ్డుకట్ట వేయడానికి సుప్రీం కోర్టు సరైన నిర్ణయం తీసుకుంది అని అంతా అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.