Begin typing your search above and press return to search.

అదానీ పెట్టుబడి నిజం కాదట : గౌతమ్ రెడ్డి

By:  Tupaki Desk   |   19 Feb 2020 8:02 AM GMT
అదానీ పెట్టుబడి నిజం కాదట :  గౌతమ్ రెడ్డి
X
అదానీ కంపెనీ వ్యవహారంలో ఏపీలో రాజకీయ రగడ మొదలైన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ తీరుతోనే అదానీ వేరే రాష్ట్రానికి తరలి వెళ్లిపోయిందని టీడీపీ ఆరోపిస్తుంటే.. గత ప్రభుత్వం అదానీ కంపెనీ రూ.70వేల కోట్లు పెట్టుబడులు పెట్టిందంటూ హంగు, ఆర్భాటం చేశారని, కానీ, అందులో ఏ మాత్రం నిజం లేదని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అదానీ కంపెనీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. విశాఖపట్నంలో మంగళవారం .. ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అవగాహన సదస్సు నిర్వహించింది.

ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గౌతం రెడ్డి మాట్లాడుతూ .. విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్‌ కు ప్రత్యామ్నాయ స్థలం ఇచ్చేందుకు నిబద్ధతతో ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అలాగే విశాఖలో అదానీ గ్రూపు రూ.70 వేల కోట్లు పెట్టుబడి పెడుతుందంటూ నాటి ప్రభుత్వం రాష్ట్రమంతా ప్రచారం చేసుకుందని, అందులో వాస్తవం లేదని అయన చెప్పారు. దీనితో టీడీపీ ఏ రేంజ్ లో ప్రజలని మభ్యపెట్టి ..లేనిదాన్ని ఉన్నట్లు చూపించిందో అర్థంచేసుకోవచ్చు. విశాఖలో ఇప్పుడు అదానీ కంపెనీకి స్థలం కేటాయిస్తున్నాం అని వైసీపీ సర్కార్ చెప్తుంటే .. గత ప్రభుత్వం మాత్రం విశాఖలో అదానీ గ్రూపు రూ.70 వేల కోట్లు పెట్టుబడి పెడుతుందంటూ ప్రచారం చేసుకుంది. దీనితో మరోసారి టీడీపీ కేవలం ప్రచార పార్టీ అని మరోసారి నిరూపించుకున్నట్లు అయ్యింది.

ఇకపోతే , ఈ సమావేశంలో ఇంకా మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ .. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క విశాఖపట్నంలోనే 50 వేల మందికి ఐటీ ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది అని అన్నారు. ఇప్పటి వరకు రూ.4,600 కోట్లు ప్రభుత్వం రాయితీగా ఇవ్వాల్సి ఉందని, త్వరలోనే వాటిని చెల్లిస్తామన్నారు. సదస్సులో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జె.సుబ్రహ్మణ్యం, విశాఖ కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తదితరులు పాల్గొన్నారు.