Begin typing your search above and press return to search.
ఫైలెట్ గా మారి విమానం నడిపిన కేటీఆర్ !
By: Tupaki Desk | 13 March 2020 9:30 AM GMTహైదరాబాద్ శివారులోని శంషాబాద్ విమానాశ్రయంలో ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్(fstc) ని మంత్రి కేటీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ ఆమోదం పొందిన ఈ సంస్థ విమానాలు నడపడంలో శిక్షణ ఇస్తుంటుంది. ఈ సందర్భంగా కేటీఆర్ విమానం కాక్ పిట్ ను పోలినట్లు ఉన్న నమూనా లో కూర్చొని, ట్రైనర్ సూచనల మేరకు ఆపరేట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
FSTC అనేది దేశంలో DGCA చేత గుర్తింపు పొందిన ప్రధాన విమానయాన టైనింగ్ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో పైలట్లకు ట్రైనింగ్ ఇస్తుంది. దేశంలో ఇప్పటి వరకు గురుగ్రామ్ లో మాత్రమే ఇటువంటిది ఉండేది. తాజాగా హైదరాబాద్‌లోనూ FSTC శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…ఎఫ్ ఎస్ టీసీ తన శిక్షణా సంస్థను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం హర్షనీయమని ప్రశంసించారు. భారతదేశంలో పౌర విమానయాన రంగానికి మంచి భవిష్యత్తు ఉందని, దీని వల్ల ఈ ప్రాంతవాసులకు శిక్షణా సౌకర్యాలు, పరిశ్రమ అభివృద్ధి, యువతకు అవకాశాలు పెరుగుతాయని కేటీఆర్ చెప్పారు. అలాగే , శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఎఫ్ ఎస్ టీసీ నిర్వాహకులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.