Begin typing your search above and press return to search.
గ్రేటర్ ఓట్ల కోసం సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు
By: Tupaki Desk | 23 Jan 2016 7:55 AM GMTసాఫ్ట్ వేర్ ఇంజినీర్లు అంటే సామాజిక బాధ్యత పట్టనివారు. తమ ప్రపంచం ఏదో తాముగా జీవించేవారు అనుకుంటాం. కానీ కాలం మారుతున్నట్లే వారు కూడా తమ ఆలోచనల పరిధిని విస్తరించుకుంటున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత విమర్శలు చేసే బదులు అంతకుముందే సిద్ధమవ్వాలని చూస్తున్నారు. పోలింగ్ రోజంటే ఇంట్లో కూర్చొని సెలబ్రేషన్స్ డే అని పీలవడానికి వారు సిద్ధంగా లేరు. పైగా ప్రజలందరినీ గ్రేటర్ సమరంలో క్రియాశీలంగా పాలుపంచుకోమంటున్నారు. తాజాగా ఇలా ఓ అసోసియేషన్ ముందుకు వచ్చింది.
తెలంగాణ ఐటీ అసోసియేషన్ పేరుతో తెరమీదకు వచ్చిన ఈ వేదిక ప్రపంచంలో పేరెన్నికగన్న పొలిటికల్ రీసెర్స్, స్ర్ట్రాటజిక్ సెంటర్ గా పేరున్న ప్రామాణ్య స్ర్ట్రాటజితో జట్టుకట్టారు. "అవాజ్ దో హైదరాబాద్-అవాజ్ దో టెకీస్" స్లోగన్స్ తో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారపర్వంలో హైదరాబాదీ ఓటర్ల మనోగతాన్ని సేకరించి వాటిని రాజకీయ పార్టీలకు ఈ బృందం ప్రతినిధులు అందజేయనున్నారు. తద్వారా ప్రజలు తమకేం కావాలని ఆశిస్తున్నారో స్పష్టంగా తెలియజెప్పనున్నారు.
ఈ బృందానికి హైదరాబాదీ ఓటర్లు తమ అభిప్రాయాలను ఐవీఆర్ ఎస్ విధానం ద్వారా తెలియజెప్పవచ్చు. 8471055557కు కాల్ చేయడం ద్వారా వారి అభిప్రాయాలు చెపితే ఆయా పార్టీల ఎజెండాలో పొందుపరిచే అవకాశం ఉండనుంది. మరోవైపు నెటిజనులు @awazdohyd పేరుతో ట్వీట్ చేయవచ్చు. @Awaz Do Techies పేరుతో ఉన్న ఫేస్ బుక్ పేజీలో కూడా తమ భావాలను వెల్లడించవచ్చు.
ఇంతేకాకుండా ఓటర్లు వాట్సప్ మెసేజ్ లు కూడా పై నంబరుకు పంపించవచ్చు. లేదా ఆ నంబరుకు మిస్ డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా తమ సమస్యలను ప్రస్తావించవచ్చు. #AwazDoHyd హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు, డిమాండ్ లు, సమస్యలు ప్రకటించవచ్చు.