Begin typing your search above and press return to search.
మాదాపూర్ ఇప్పుడు బాధాపూర్
By: Tupaki Desk | 12 May 2017 5:25 AM GMTహైదరాబాద్ లోని మాధాపూర్ అంటే సిటీలోనే హైటెక్ ప్లేస్. లక్షల్లో జీతాలు అందుకునే బ్యాచ్ అంతా నిత్యం నవ్వుతూ తుళ్లుతూ తిరిగే ఏరియా. కానీ, ఇప్పుడక్కడ అందరిలో ముఖాల్లో నవ్వులు మాయమవుతున్నాయి. ఏదో తెలియని అలజడి ఇప్పటికే ఉద్యోగం పోగొట్టుకున్న వేలాదిమంది... ఎప్పుడు తమ ఉద్యోగం ఊడుతుందో తెలియని అంతకుమించిన మంది ముఖాలు వేలాడేసుకుని తిరుగుతున్నారు.
మాదాపూర్ లో గత 30 రోజుల్లో దాదాపు నాలుగు వేలమంది ఐటి ఉద్యోగులను ఉద్యోగాల నుంచి వివిధ కంపెనీలు తొలగించడంతో ఐటి రంగంలో తీవ్రమైన ఆందోళన నెలకొంది. ముఖ్యంగా సీనియర్ ఉద్యోగులకు నిత్యం టెన్షన్ మొదలవుతోంది.
కాగా మాదాపూర్ ఐటి కంపెనీల నుంచి ఉద్వాసనకు గురైన నాలుగు వేలమంది ఐటి నిపుణులు, ఉద్యోగులు తొలిసారిగా కార్మిక సంక్షేమ భవన్ గుమ్మమెక్కారు. కాగ్నిజెంట్ - విప్రో - టెక్ మహీంద్రా తదితర కంపెనీలు వేటు వేయడంతో ఉద్యోగాలు కోల్పోయిన వారు తెలంగాణ ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా)ని ఆశ్రయించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/