Begin typing your search above and press return to search.
సిద్దరామయ్యకు కౌంట్ డౌన్ స్టార్ట్..
By: Tupaki Desk | 28 April 2018 11:47 AM GMTకర్ణాటకలో మొత్తం 224 ఎమ్మెల్యే సీట్లకు మే 12న పోలింగ్ జరగనుండగా.. మే 15న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచార వేడి మొదలైంది. త్వరలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపొందేందుకు బీజేపీ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు ఇలా రాజకీయ నేతలు విమర్శలు చేసుకుంటుంటే..మరోవైపు ఐటీ దాడులు జరుగుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కర్ణాటక కనీస వేతనాల సలహా మండలి అధ్యక్షుడైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బంధువు ఉమేష్ ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. చామరాజనగరలోని కోర్టు వీదిలోని ఉమేష్ ఇంటిపై 14 మంది ఆదాయపన్ను శాఖ అధికారులు ఉమేష్ ఇంటికి డోర్ లాక్ చేసుకుని సోదాలు చేసి వివిద పత్రాలు పరిశీలిస్తున్నారు. ఈ పరిణామం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు షాక్ ఇచ్చేందుకేనని అంటున్నారు.
ఇదిలాఉండగా....ఖానాపుర శాసన సభ నియోజక వర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాసీర్ భగవాన్ ఇంటిలో శనివారం ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాసీర్ భగవాన్ తన ఆస్తి రూ. 191 అని ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనపై దాడులు జరగడం గమనార్హం. ఇదిలాఉండగా...బీజేపీ చీఫ్ అమిత్ షా కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. సిద్దరామయ్య ప్రభుత్వం అంతానికి కౌంట్‌డౌన్ ప్రారంభమయిందన్నారు.
ఎన్నికల ప్రచారం కోసం రెండు రోజుల పర్యటనకు షా కర్ణాటకకు వెళ్లారు. ఈ సందర్భంగా షా తన రెండో రోజు పర్యటనలో భాగంగా కొన్ని పబ్లిక్ ర్యాలీలలో పాల్గొననున్నారు. అంతకుముందు ఆయన కుందాలసంగామలో ఉన్న బసవేశ్వర ఐక్య స్థలను సందర్శించి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత బాగల్‌కోట్‌లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. "సిద్దరామయ్యా.. నీ కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. మేము కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. ఇప్పటి వరకు 12 రాష్ర్టాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఇక.. కర్ణాటకలోనూ దాని అంతానికి రోజులు దగ్గరపడ్డాయి. సిద్దరామయ్యను కాంగ్రెస్ బదామి నుంచి పోటీచేయాలని బలవంత పెడుతోంది. అయితే.. బదామిలో సిద్దరామయ్య ఖచ్చితంగా ఓడిపోతాడు. సిద్దరామయ్యా.. నేను నిన్ను అభ్యర్థిస్తున్నాను.. ఈసారి బీఎస్ యడ్యూరప్పకు అవకాశం ఇస్తే.. ఆయన కర్ణాటకను నెంబర్ వన్ రాష్ట్రంగా చేసి చూపిస్తాడు. నేను కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో తిరిగాను. ఎక్కడ చూసినా జనాల్లో బీజేపీపై అదే ఉత్సాహం - అదే నమ్మకం కనిపిస్తున్నది.." అని అమిత్ షా తెలిపారు.