Begin typing your search above and press return to search.

అన్నాడీఎంకేపై అటాకా? ఆంధ్రోళ్లపై అటాకా?

By:  Tupaki Desk   |   21 Dec 2016 8:54 AM GMT
అన్నాడీఎంకేపై అటాకా? ఆంధ్రోళ్లపై అటాకా?
X
తమిళనాడులో జరుగుతున్న ఐటీ శాఖ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకేలోని తెలుగు నేత శేఖర్ రెడ్డి ఇంటిపై దాడి చేసి కోట్ల మొత్తంలో డబ్బు పట్టుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా మరో కలకలం రేగింది. తమిళనాడులో అత్యున్నత అధికారిక అయిన.. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌ రావునే ఐటీ శాఖ టార్గెట్ చేసింది. ఈ రోజు తెల్లవారుజామున చెన్నై అన్నానగర్‌లోని ఆయన ఇంటిపై ఐటీ అధికారులు మెరుపుదాడి చేశారు. నోట్ల రద్దు నేపథ్యంలో ఇటీవల ఆయన వందల కోట్లను బంగారం రూపంలోకి మార్చారన్న అనుమానంతో ఐటీ దాడులు చేసినట్టు చెబుతున్నారు.

కాగా ఏకంగా సీఎస్‌ ఇంటిపైనే దాడులు చేయడంతో ప్రభుత్వంతో పాటు అన్నాడీఎంకే వర్గాల్లోనూ ఆందోళన నెలకొంది. ఏకంగా సీఎస్ మీదే దాడులు జరిగాయంటే దీని వెనుక ఏదో పెద్ద కుట్ర దాగి ఉందని భావిస్తున్నారు. భారీ దాడలు రెండూ అన్నాడీఎంకేకు సంబంధించినవారిపైనే జరగడం... ఇద్దరూ తెలుగోళ్లు కావడం ఇక్కడ గమనార్హం.

రామ్మోహన్‌రావు కేవలం సీఎస్‌గానే కాకుండా అన్నాడీఎంకే రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. జయకు నమ్మకస్తుడిగా చక్రం తిప్పుతూ వచ్చారు. జయఆసుపత్రి పాలయినప్పటి నుంచి రాష్ట్రాన్ని నడిపించడంలో ఆయనది కీలక పాత్రం. అయితే ఈ దాడుల వెనుక రెండు కోణాలు ఉండవచ్చని భావిస్తున్నారు. జయ మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో పట్టుకోసం బీజేపీ ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అన్నాడీఎంకేకు మద్దతుగా ఉన్న శేఖర్ రెడ్డి - ఇప్పుడు సీఎస్‌ పైన ఐటీని ప్రయోగించినట్టు భావిస్తున్నారు. అన్నాడీఎంకేలో అలజడి సృష్టించడంతో పాటు, ఆ పార్టీకి మద్దతుదారులుగా ఉన్న వారిలో భయాన్ని సృష్టించడం ద్వారా పార్టీని విస్తరించే వ్యూహానికి అడ్డులేకుండా చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని భావిస్తున్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వంపై అవినీతి ముద్ర వేసే వ్యూహం కూడా ఉండవచ్చంటున్నారు.

లేదంటే... అన్నాడీఎంకేలోనే వర్గ విభేధాలు.. గ్రూపులు ఇలా ఉప్పందించి ఉండొచ్చనీ భావిస్తున్నారు. సీఎస్ రామ్మోహనరావుపై దాడికి ముందు ఐటీ శాఖకు ఆయనపై ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ఐటీ శాఖ ఇచ్చిన మెయిల్ ఐడీకి సీఎస్ పై సుమారు 50 కంప్లయింట్లు వచ్చాయని చెబుతున్నారు. సో.... ఇదంతా పార్టీలో విభేదాలు... కుర్చీల కోసం కొట్లాల నేపథ్యంలో జరుగుతున్నదిగా కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/