Begin typing your search above and press return to search.

దాడులతో కలవరం: వణుకుతున్న టీడీపీ

By:  Tupaki Desk   |   10 Feb 2020 8:40 AM GMT
దాడులతో కలవరం: వణుకుతున్న టీడీపీ
X
ఆంధ్రప్రదేశ్ లో సీఐడీ, ఐటీ, ఈడీ కేసులు కలకలం రేపుతున్నాయి. ఈ దాడులు ప్రతిపక్ష పార్టీ టీడీపీలో వణుకు పెట్టిస్తోంది. నాలుగు రోజులుగా టీడీపీ నాయకుల నివాసాల్లో దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల పరంపర కొనసాగుతోంది. టీడీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు కొనసాగుతున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, వారి బినామీ వ్యక్తుల నివాసాలు, బీనామీ సంస్థల కార్యాలయాల్లో వరుసగా తనిఖీలు చేస్తుండడంతో పచ్చ పార్టీ నేతల్లో కలవర పెడుతోంది.

అయితే గత ప్రభుత్వంలో జరిగిని అవినీతి, అక్రమాలు తవ్వే ఆలోచనలో ఉన్నాయి. టీడీపీ నేతల నివాసాలపై ఏసీబీ, ఐటీ దాడులు, మరో పక్క అమరావతి భూముల ఇన్సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ కేసులు, అంతేకాక ఈడీ, ఐటీ తదితర సంస్థలు తనిఖీలు చేస్తుండడంతో టీడీపీ నాయకులకు ముచ్చెమటలు పుట్టిస్తున్నాయి. ఈ సమయం లో టీడీపీ నాయకులు అప్రమత్తమైనట్టు సమాచారం. చంద్రబాబు, లోకేశ్ కు సన్నిహిత వ్యక్తులపై దాడుల విషయమై హైదరాబాద్ లో దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల పై పార్టీ అధినేత చంద్రబాబు గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ లోని తన నివాసంలో తీవ్ర సమాలోచనలు చేశారని సమాచారం .

తమ పార్టీ నేతలను రక్షించుకోవడం, పార్టీని పటిష్టం చేయడం, మళ్లీ అధికారంలోకి వచ్చేలా ఏం చేయాలనే విషయమై ఆలోచన చేశారు. ఏపీ, తెలంగాణలో ఏకకాలంలో సాగుతున్న ఢిల్లీ ఐటీ బృందాల దాడులు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన పీఏగా పనిచేసిన శ్రీనివాస్ రావుపై, మాజీమంత్రి ప్రతిపాటి పుల్లారావు తనయుడు నివాసంలో, చంద్రబాబు, మాజీమంత్రి లోకేశ్, సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్న పరిస్థితులతో తెలుగు దేశం ఉక్కిరిబిక్కరవుతోంది.

చంద్రబాబు మాజీ పీఏ ఇంట్లో రూ.150 కోట్ల ముడుపుల లెక్క చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో, విజయవాడ, హైదరాబాద్ లలో ఆయన ఆస్తులపైన ఐటీ బృందాలు చేసిన సోదాల్లో విలువైన డాక్యుమెంట్లు, పత్రాలు స్వాధీనం చేసుకోవడంతో ఎవరి గుట్టు బయటపడుతుందోనని కలవర పడుతున్నారు. విజయవాడ గాయత్రి నగర్ లోని చేసిన సోదాల్లో రహాస్య లాకర్ నుంచి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనిలో టీడీపీకి చెందిన ముఖ్యనేతకు ఇచ్చిన 150 కోట్ల ముడుపుల లెక్క ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఇక ఈ లెక్కలు ముంబైకి చెందిన ఓ కాంట్రాక్ట్ సంస్థ ఇచ్చిన లెక్కలు ఉన్నట్టు తెలుస్తోంది.

లోకేశ్ బినామీగా, సన్నిహితులుగా కిలారు రాకేశ్, నరేన్ చౌదరిలు ఉన్నారు. దీంతో వారిపై కూడా ఐటీ శాఖ దాడులు చేసింది. వందల కోట్ల ఐటీ రిటర్న్స్ లో రాకేశ్ అవకతవకలకు పాల్పడినట్టు సమాచారం. కిలారీ రాజేశ్, నరేన్ చౌదరిలను జీఎస్టీ ఇంటెలిజెన్స్ అదుపులోకి తీసుకున్నట్టు పుకార్లు వస్తున్నాయి. అయితే ఈ విషయమై ఎవరూ స్పందించడం లేదు.