Begin typing your search above and press return to search.
ముగిసిన సోదాలు..11 గంటలకు రేవంత్ ప్రెస్ మీట్!
By: Tupaki Desk | 29 Sep 2018 3:44 AM GMTతెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో సుదీర్ఘంగా జరిగిన ఐటీ సోదాలు ముగిశాయి. శనివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఐటీ అధికారులు రేవంత్ నివాసం నుంచి వెళ్లిపోయారు. గురువారం ఉదయం 7 గంటలకు మొదలైన తనిఖీలు దాదాపు 44గంటలపాటు సాగి శనివారం తెల్లవారుజాము వేళకు ముగిశాయి. సోదాల్లో రేవంత్ రెడ్డితో పాటు ఆయన భార్య గీతను దాదాపు 31 గంటల పాటు ఐటీ అధికారులు ప్రశ్నించారు. విచారణ తర్వాత వారి వద్ద నుంచి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు రేవంత్ - ఆయన భార్య సంతకాలు తీసుకున్నారు. ఇక రేవంత్ రెడ్డి అక్టోబర్ 3వ తేదీన హైదరాబాద్ బషీర్ బాగ్ లోని ఐటీ శాఖ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆయనకు నోటీసులు ఇచ్చారు. రేవంత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు కొండల్ రెడ్డి - సన్నిహితుడు ఉదయ్ సింహా - ఎమ్మెల్సీ సెబాస్టియన్ ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో గురువారం రాత్రి ఏడు గంటలకు రేవంత్ ఇంట్లో అధికారులు సోదాలు ప్రారంభించారు. రెండు రోజులపాటు జరిగిన ఈ సోదాల్లో ప్రింటర్లు - కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో రూ.20 కోట్లు లెక్కలు చూపని ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఈ సొమ్ము రేవంత్ రెడ్డి బావమరిది జయప్రకాశ్ రెడ్డికి చెందిన శ్రీ సాయిమౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందినదిగా గుర్తించారు.
రేవంత్ రెడ్డి - ఆయన భార్యను కలిపి దాదాపు 31 గంటలపాటు అధికారులు విచారించారు. 150 ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు రాయించుకున్నారు. కాగా - తన వియ్యంకుడు పోర్షే కారు వాడుతుండడంపై అధికారులు అడిగిన ప్రశ్నకు రేవంత్ బదులిస్తూ.. అతడు పోర్షే కారు వాడితే తప్పేంటని ప్రశ్నించినట్టు తెలిసింది. రేవంత్ ఇంటికి ఓటుకు నోటు నిందితుడు ఉదయసింహను అధికారులు తీసుకొచ్చారు. రూ.50 లక్షలపై ఇద్దరినీ కలిపి విచారించారు. రేవంత్ భార్య గీతను తీసుకెళ్లి లాకర్లు తనిఖీ చేశారు. కాగా, ఈ ఉదయం 11 గంటలకు రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు.