Begin typing your search above and press return to search.

చంద్రబాబు మాజీ పీఏపై ఐటీ రైడ్స్..150కోట్ల ఆస్తుల గుర్తింపు?

By:  Tupaki Desk   |   6 Feb 2020 10:39 AM GMT
చంద్రబాబు మాజీ పీఏపై ఐటీ రైడ్స్..150కోట్ల ఆస్తుల గుర్తింపు?
X
తీగలాగితే డొంక కదులుతోందా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పీఏగా పనిచేసిన శ్రీనివాస్ పై ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. ఈ ఉదయం నుంచి చంద్రబాబు పీఏగా పనిచేసిన శ్రీనివాస్ ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో నమ్మశక్యం లేని విషయాలు వెలుగుచూస్తున్నట్టు సమాచారం అందుతోంది.

శ్రీనివాస్ గత ఏడాది చంద్రబాబు సీఎం గా ఉండే వరకూ ఆయన పీఏగా పనిచేశారు. సెక్రటేరియట్ ఉద్యోగి అయిన శ్రీనివాస్.. చంద్రబాబు పీఏగా ఉన్న సమయంలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఐటీ అధికారులు దాడులతో అతడి బండారం బయట పడనుంది.

తాజాగా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు శ్రీనివాస్ పీఏగా పనిచేశారు. ఆయనకు చెందిన విజయవాడతోపాటు హైదరాబాద్ లోని చంపాపేట్ లో ఉన్న ఆయన ఇళ్లు, ఆఫీసుల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో దాదాపు 150 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, డాక్యుమెంట్లు అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది.

శ్రీనివాస్ కు పలు ఇళ్లు, ఆస్తులు ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. రకరకాల పేర్లతో పలు కంపెనీలు కూడా స్థాపించినట్టు తెలుస్తోంది. ఆ కంపెనీలకు సంబంధించిన లావాదేవీలు సక్రమంగా లేవని ఐటీ అధికారులు నిర్ధారించారు. చంద్రబాబు పీఏగా ఉన్న శ్రీనివాస్ కోట్ల అధిపతి గా మారడం వెనుక కారణమేంటి? అతడికి అన్ని ఆస్తులు ఎలా వచ్చాయన్నది ఆరాతీస్తున్నారు. నోటీసులు అందించి కేసులు నమోదు చేయడానికి రెడీ అయ్యారు.

చంద్రబాబు పీఏగా ఉంటూ ఆస్తులు కూడబెట్టిన శ్రీనివాస్ వైనం కలకలం రేపింది. ఆయన కాడి తవ్వితే ఎవరి దగ్గర తేలుతుందనేది ఉత్కంఠగా మారింది.