Begin typing your search above and press return to search.
సీఎం రమేష్ ఇళ్లపై ఐటీ దాడులు
By: Tupaki Desk | 12 Oct 2018 4:49 AM GMTటీడీపీ నేతలను ఐటీ దాడులతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బెంబేలెత్తిస్తోంది. వరుసగా జరుగుతున్న దాడులు ఏపీలో కలకలం రేపుతున్నాయి. తాజాగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఒకేసారి ఏకంగా 100మంది అధికారులు 25 ప్రదేశాల్లోని రమేష్ ఆస్తులపై శుక్రవారం ఉదయం నుంచి ఏకకాలంలో దాడులు చేస్తున్నారు.. కడపలోని సీఎం రమేష్ నివాసం - కార్యాలయంతోపాటు హైదరాబాద్ లో 8 చోట్ల, కడపలో 2 చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రమేష్ కాంట్రాక్టులు * పాలుపంచుకున్న నిర్మాణాలకు సంబంధించిన వివారాలు సేకరించినట్టు తెలిసింది.
కాగా పార్లమెంటు పీఏసీ సభ్యుడిగా ఉన్న సీఎం రమేశ్ ఇటీవలే ఏపీలో జరుగుతున్న ఐటీ దాడులపై సమాచారం ఇవ్వాలని పార్లమెంట్ పీఏసీ కమిటీలో నోటీసులు ఇచ్చారు. ఇలా కోరిన మూడురోజుల వ్యవధిలోనే కేంద్రం ఈ దాడులకు పురిగొల్పడం విశేషం.
మొన్నీ మధ్యే టీడీపీకి చెందిన ఎంపీ సుజనాచౌదరి ఆస్తులపై ఐటీ దాడులను మరిచిపోకముందే టీడీపీకి ఆర్థిక వెన్నుదన్నుగా ఉండే మరో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంటిపై దాడులకు దిగి బీజేపీ ప్రభుత్వం టీడీపీకి గట్టి షాకే ఇచ్చిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు..
కడప ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేపట్టిన సీఎం రమేష్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అక్కడ సంబంధిత శాఖ ముఖ్యులను కలుస్తున్నారు. ఏపీలో ఈ విధమైన దాడులు జరగడంతో ఇది బీజేపీ కుట్ర అని ఆయన ఆరోపిస్తున్నారు. ఇది కక్ష సాధింపు చర్య అని రమేష్ మండిపడ్డారు.