Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి నారాయణకు మరో భారీ షాక్ ...ఏమైందంటే !

By:  Tupaki Desk   |   4 March 2020 12:20 PM GMT
మాజీ మంత్రి నారాయణకు మరో భారీ షాక్ ...ఏమైందంటే !
X
అయన టీడీపీ హయాంలో రాష్ట్రంలో నాకంటే తోపు ఎవరు లేరు అన్నంత రేంజ్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోయారు. కానీ , ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ..గత కొద్దిరోజులుగా రాజకీయాలకి దూరంగా ఉంటూ , తన వ్యాపారాలపైనే పూర్తి ఫోకస్ పెట్టారు. ఎన్నికల తరువాత పూర్తిగా డీలా పడిపోయిన నారాయణ కి తాజాగా మరో భారీ షాక్ తగిలింది. ఏపీలోని నారాయణ, చైతన్య కాలేజీలపై ఆదాయపు పన్ను శాఖ ఈరోజు ఉదయం నుంచి మెరుపు దాడులు నిర్వహిస్తుంది.

ఉదయం 8 గంటలకే సంబంధిత కాలేజీలకు చేరుకున్న ఐటీ సిబ్బంది - అందర్నీ బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు. ఐటీ రిటర్న్స్ కు సంబంధించిన అవకతవకలపై డాక్యుమెంట్లు పరిశీలించి - పలు రికార్డ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత తాటిగడప - ఈడ్పుగల్లులోని క్యాంపస్ లపై కూడా ఐటీ దాడులు జరిగాయి. హైదరాబాద్ లోని మాదాపూర్ బ్రాంచ్ కు చెందిన చైతన్య కాలేజ్ పై కూడా దాడులు జరిగాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని లొకేషన్లలో నారాయణ - చైతన్య కాలేజీలపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు జరుపుతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు కీలకమైన అన్ని కాలేజీల్లో ఈ దాడులు జరుగుతున్నట్టు సమాచారం. కార్పొరేట్ విద్యాసంస్థలలో అగ్రగ్రామిగా ఉన్న ఈ రెండు సంస్థలు ..విద్యార్థుల ఫీజుల ద్వారా వచ్చిన కోట్లాది రూపాయలకు సంబంధించిన న్యాయబద్ధంగా కట్టాల్సిన పన్ను ఎగవేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

గత కొంతకాలంగా..నారాయణ - శ్రీ చైతన్య కాలేజీల్లో జరుగుతున్న అడ్మిషన్లు - వ్యాపార లావాదేవీల్లో వెల్లడించిన వివరాలు వేరేగా ఉన్నాయని ఆరోపణలున్నాయి. దీంతో పూర్తి సమాచారం తీసుకున్న తర్వాతే..ఐటీ అధికారులు రంగంలోకి దిగి సోదాలు నిర్వహించారు. కంప్యూటర్స్ హార్డ్ డిస్క్, ఇతర రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇకపోతే నేటి నుండి ఇంటర్ విద్యార్ధులకి వార్షిక పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో స్టాఫ్ మొత్తం ఆ ఏర్పాట్లలో ఉన్న తరుణంలో ఐటీ అధికారులు మెరుపు దాడులు చేయడంతో నారాయణ-చైతన్య సిబ్బంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అనుమతి లేకుండా, నిబంధనల్ని సరిగ్గా పాటించకుండా నడుపుతున్న నారాయణ, చైతన్య బ్రాంచీలని తక్షణమే సీజ్ చేయాలని తెలంగాణ హైకోర్టు ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే.