Begin typing your search above and press return to search.

బాబు సన్నిహితుడిపై ఐటీ దాడి

By:  Tupaki Desk   |   30 Oct 2018 10:10 AM GMT
బాబు సన్నిహితుడిపై ఐటీ దాడి
X
ఏపీలో ఐటీ దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. గుంటూరులో టీడీపీ నేత ఎల్వీఆర్ క్లబ్ కార్యదర్శి గ్యాస్ నాని నివాసాల్లో సోమవారం ఐటీ దాడులు నిర్వహించారు. మంగళవారం కూడా కొనసాగించారు. తాజాగా మంగళవారం విశాఖలో పేరం గ్రూప్ అధినేత, టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ సమీప బంధువు హరిబాబు ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని పేరం ప్రధాన కార్యాలయంలో మంజీరా మెజిస్టిక్ మాల్ లో అధికారులు తనిఖీలు చేపట్టారు. కర్ణాటకలోని పేరం రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి.

ఈ సోదాల్లో ఐటీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు మీడియాలో వార్తలొస్తున్నాయి. పేర హరిబాబు చేస్తున్న వ్యాపారాలకు - ప్రభుత్వానికి చెల్లించే పన్నులకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న అనుమానంతోనే సోదాలు చేస్తున్నట్టు తెలిసింది.

పేరం హరిబాబు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు. చంద్రగిరి నియోజకవర్గంలో కీలక నేత. గుంటూరు జిల్లా గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ కు స్వయానా వియ్యంకుడు..