Begin typing your search above and press return to search.
బాబు బ్యాచ్ అదిరేలా ఐటీ సిత్రాలేనట!
By: Tupaki Desk | 8 Oct 2018 4:57 AM GMTఅధికారం చేతిలో ఉన్నప్పుడు అంతో ఇంతో ఇల్లు చక్కబెట్టుకోవటం మామూలే. అయితే.. ఇది కాస్తా బరితెగింపుగా మారితేనే అసలు ఇబ్బంది అంతా. ప్రజా సంక్షేమాన్ని వదిలేసి.. అభివృద్ది పట్టనట్లుగా వ్యవహరిస్తూ.. తమ సొంత లాభం తప్పించి రాష్ట్ర ప్రయోజనాలు అస్సలు పట్టని రీతిలో వ్యవహరించిన తెలుగు తమ్ముళ్లకు.. వారి అండ చూసుకొని చెలరేగిపోయి.. ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టేసిన ఘనులకు ఇప్పుడు సిత్రాల మీద సిత్రాలు చూపించటం ఖాయమంటున్నారు.
ఇటీవల ఏపీలో జరిగిన ఐటీ దాడులన్నవి ట్రయలర్లు మాత్రమేనని.. అసలు సినిమా ముందుందని చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రానున్న రోజుల్లో సూపర్ సినిమా సీన్లు ఖాయమన్న మాట వినిపిస్తోంది. రాష్ట్రంలోని కొందరు బడా నేతలతో పాటు.. ఒకరిద్దరు కీలక అధికారుల మీదా దాడులు పక్కా అని చెబుతున్నారు.
ఇటీవల జరిగిన ఐటీ దాడులు రాజకీయ ప్రేరేపితమని.. మోడీ ప్రభుత్వమే చేయిస్తుందన్న విమర్శల నేపథ్యంలో అధికారులు కాస్త వెనకడుగు వేసినట్లుగా చెప్పక తప్పదు.
తమ ఉద్దేశాల్ని తప్పుగా ప్రచారం చేయటంతో పాటు.. తమకు రాజకీయ ముద్ర వేసిన తీరుతో ఐటీ అధికారులు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించనున్నట్లుగా చెబుతున్నారు. గడిచిన నాలుగేళ్లలో భారీ ఎత్తున సాగిన అవినీతిపై కీలక సమాచారం ఐటీ శాఖ వద్ద ఉందని.. ఇందుకు సంబంధించిన ఆధారాల్ని ఇప్పటికే ఐటీ అధికారులు సేకరించినట్లుగా తెలుస్తోంది.
రానున్న రోజుల్లో ఐటీ దాడులు.. సోదాలు.. ఆ సందర్భంగా వెలుగు చూసే అంశాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారటమే కాదు.. పెను సంచలనానికి తెర తీస్తాయని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాచ్ కు చెందిన పలువురికి ఐటీ పోటు పక్కా అని.. చుక్కలు చూపించే సిత్రాలు బ్యాక్ టు బ్యాక్ ఖాయమంటున్నారు.