Begin typing your search above and press return to search.
టీడీపీ నేత ఇంట్లో ఐటీ సోదాలు..!
By: Tupaki Desk | 22 Dec 2016 6:16 AM GMTదేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు ఇదే రీతిలో చిత్తూరులో టీడీపీ నేత బద్రీనారాయణ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. అయితే చిత్రంగా ఐటీ ఆధికారులు ఓవైపు సోదాలు నిర్వహిస్తుండగా - మరోపక్క ఆయన జన్మదిన వేడుకలను ఇంటి వద్దనే ఘనంగా నిర్వహించారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు ఇంటిపై ఐటి అధికారుల దాడులు నిర్వహించిన నేపథ్యంలో ఆయన వియ్యంకుడైన చిత్తూరుకు చెందిన టీడీపీ నేత బద్రీనారాయణ ఇంటిపై కూడా ఏకకాలంలో దాడులు జరిగాయి. అపుడు ఈ చిత్రం చోటుచేసుకుంది.
ఐటి అధికారుల బృందాలు సోదాలు చేస్తుండగానే బద్రీనారాయణ అభిమానులు పార్టీ శ్రేణులు ఇంటి వద్ద ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించారు. భారీ కేకు కట్ చేసి పెద్దఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు అభిమానులు బద్రీనారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒకపక్క ఇంట్లో సోదాలు జరుగుతుండగా మరోపక్క అక్కడే ఈ జన్మదిన వేడుకలు జరగడం నగరంలో చర్చనీయాశంగా మారింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పార్టీ నేతలు - కార్యకర్తలు తరలివచ్చి పెద్దఎత్తున నినాదాలు చేయడంతో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఇంటి వద్ద ముందస్తు చర్యగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తమిళనాడు సిఎస్ రామ్మోహన్ రావు ఇంటిపై ఐటి దాడులు నిర్వహించడంతో తన స్వగ్రామం అయిన ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కె బిట్రగుంట గ్రామంలో కలకలం రేపింది. రామ్మోహన్ రావు తల్లి శివరావమ్మ 2007లో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శివరావమ్మకు ముగ్గురు కుమారులు - కుమార్తెలు. అందులో పెద్దకుమారుడే తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు. రెండో కుమారుడు విజయ్ - మూడవ కుమారుడు శ్రీనివాసులు - కుమార్తె శేషమ్మ - ముగ్గురు కుమారులు తమిళనాడులో జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం కుమార్తె శేషమ్మ బిట్రగుంటలో జీవనం సాగిస్తున్నారు. శివరావమ్మకు ఆరోగ్యం బాగా లేనందున ప్రస్తుతం కుమారుల వద్దనే ఉంటున్నట్లు సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/