Begin typing your search above and press return to search.
ఆ తోపు బిల్డర్ మీద ఐటీ దాడులు.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్
By: Tupaki Desk | 7 Dec 2022 4:17 AM GMTమంగళవారం ఉదయం జరిగిన ఐటీ దాడులు రెండు తెలుగురాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారాయి. కారణం.. సదరు తోపు బిల్డర్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతలకు అత్యంత సన్నిహితుడు కావటమే. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరుగా వంశీ రాం బిల్డర్స్ కు పేరుంది. ఆయన చేపట్టే ప్రాజెక్టులు రోటీన్ కు భిన్నంగా ఉంటాయన్న పేరుంది.
ఎవరూ చేయలేని.. చేపట్టలేని ప్రాజెక్టుల్ని టేకప్ చేసి.. టైమ్లీగా పూర్తి చేయటం ఆయనకు మాత్రమే సాధ్యమన్న పేరుంది. తెలంగాణ రాష్ట్రంలో కీలక నేతకు సన్నిహితుడన్న పేరుతో పాటు.. ఏపీలోని అధికార వైసీపీకి చెందిన నేతలతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా చెబుతారు. వల్లభనేని వంశీతో పాటు దేవినేని అవినాష్ తో పాటు మరికొందరు నేతలతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెబుతారు.
మంగళవారం ఉదయం ఒకేసారి పెద్ద ఎత్తున ఐటీ సోదాలు నిర్వహించటం.. వేర్వేరు ప్రాంతాల్లో ఇవి కొనసాగటం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న సమయంలోనే ఏపీలోని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంట్లోనూ తనిఖీలు నిర్వహించటం కలకలం రేపింది. బంజారాహిల్స్ లోని వైసీపీ నేత దేవినేని అవినాష్ కు చెందిన స్థలాన్ని వంశీరాం బిల్డర్స్ డెవలప్ మెంట్ కోసం తీసుకున్నట్లుగా చెబుతారు. ఈ ఒప్పందం మీద జరిగిన లావాదేవీల మీద కూడా ఐటీ వర్గాలు ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ అధికారపక్ష ముఖ్యనేతతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న వేళ.. తాజా ఐటీ దాడులకు ప్రాధాన్యత పెరిగింది. కేటీఆర్ లక్ష్యంగానే ఈ సోదాలు జరిగినట్లుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కవిత మీద ఫుల్ ఫోకస్ పెట్టిన కేంద్రం..
ఇప్పుడు కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్ ను టార్గెట్ చేసుకునేందుకు వీలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ ప్రక్రియలో విచారణ సంస్థలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.