Begin typing your search above and press return to search.
టీడీపీ నేతలపై ఐటీ దాడులు
By: Tupaki Desk | 21 March 2019 6:16 PM GMTఎన్నికలు దగ్గరపడుతున్నాయి. రాజకీయాలు మొదలయ్యాయి. నయానో భయానా - బెదిరించో బతిమాలో ఎలాగైనా సరే అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు అన్ని పార్టీలు అడ్జదారులు తొక్కుతున్నాయి. ఇక ఏపీలో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కాకూడదనే ఉద్దేశంతో పనిచేస్తున్న బీజేపీ.. ఇప్పుడు టీడీపీ నేతల్ని టార్గెట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే రేపో - ఎల్లుండో బలమైన టీడీపీ అభ్యర్థులు ఉన్నచోట.. ఐటీ దాడులు జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక ఏపీ మంత్రి - నారాయణ విద్యాసంస్థల ఓనర్ నారాయణపై ఈ సాయంత్రం ఐటీ దాడులు జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ విషయాన్ని అటు నారాయణ యాజమాన్యం కానీ మంత్రి నారాయణ కానీ ఖండించేలేదు అలాగని ఒప్పుకోనూలేదు. దీంతో.. ఐటీ దాడులు జరిగిన మాట నిజమేనని సమాచారం.
ఎన్నికల ముందు బలమైన ప్రత్యర్థులపై ఇలా దాడులు చేయడం రాజకీయాల్లో సహజం. తెలంగాణలో ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి - జగ్గారెడ్డిపై కూడా ఇలాంటి దాడులే జరిగాయి. ఇక కర్నాటక - గోవాల్లో కూడా బీజేపీ ఇలాంటి దాడులే చేసింది. ఇప్పుడు ఏపీలో కూడా మంత్రులుగా పనిచేసి జిల్లాలో కీలకంగా ఉండే టీడీపీ నేతలపై ఐటీ దాడులు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే.. టీడీపీ నేతలు కాస్త జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే చంద్రబాబు నుంచి కూడా ఆదేశాలు వెళ్లాయట.