Begin typing your search above and press return to search.
దేశంలో అధికారం ఎవరిది? రాబోయే 30 అసెంబ్లీ ఎన్నికలతో తేలనుంది?
By: Tupaki Desk | 30 Oct 2021 7:35 AM GMTవివిధ కారణావల్ల నిర్వహిస్తున్న ఉప ఎన్నికలను ఒకప్పుడు తేలికగా తీసుకునేవారు. కానీ ఈ చిన్నపాటి సంగ్రామమే దేశ భవిష్యత్తును మార్చేస్తాయని అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. మరో రెండు సంవత్సరాల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగే ఉప ఎన్నికలతో బీజేపీ భవితవ్యం ఏంటనేది తేలుతుందని అంటున్నారు. తెలంగాణలో హుజూరాబాద్, ఏపీలో బద్వేల్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి దేశంలో 30 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలకు శనివారం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే కేవలం ఉప ఎన్నికలు పార్టీల భవితవ్యంతో పాటు నేతల తలరాతలు మార్చేందుకు ఎందుకు కారణమవుతున్నాయి...? ఈ ఉప ఎన్నికలను ఆయా పార్టీలు ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి..?
తెలంగాణలో హుజూరాబాద్ అసెంబ్లీకి ఎన్నిక జరుగుతోంది. ఇక్కడ మాజీ మంత్రి ఈటల రాజేందర్ గెలిస్తే తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఆయన సాధారణ రాజకీయ నాయకుడిగా కొనసాగుతారా..? లేదా..? అనేది అనుమానంగానే ఉంది. అయితే ఈటల గెలుపు బీజేపీకి కూడా అవసరమే. ఈ విజయంతో బీజేపీ తన సత్తా నిరూపితమైందని చెప్పే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే టీఆర్ఎస్ తన పార్టీ స్ట్రాటజీ ఏమాత్రం తగ్గలేదని నిరూపించేందుకు ఇప్పటికే శతవిధాల ప్రయత్నించింది. దీంతో ఇక్కడ గెలుపు ఎవరిని వరించినా వారికి వచ్చే ఎన్నికల్లో విజయం తథ్యమనే సంకేతాలు వినిపిస్తున్నాయి.
బద్వేల్ ఉప ఎన్నికను తీసుకుంటే ఇక్కడ వైసీపీకి పెద్దగా పోటీ లేకున్నా బీజేపీకి మాత్రం క్యాండెడ్ ను నిలబెట్టింది. తాము వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని అభ్యర్థితో ప్రచారం చేయించింది. ఇక్కడ ప్రధానంగా రెండు పార్టీల మధ్యే పోటీ కావడంతో బీజేపీ ఎలాగైనా విజయం సాధించడం కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే వైసీపీ ఈ ఉప ఎన్నిక తమ ఖాతాలోకే వస్తుందని ధీమాగా ఉంది. కానీ ఓటర్ల నాడిపై బీజేపీ నమ్మకం పెట్టుకుంది. ఇక్కడ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో కమలంను గెలిపిస్తారని అంటున్నారు.
ఇక దేశంలో మరికొన్ని చోట్ల ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్లో తిరుగుబాటు ఆధారంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడ జరిగే ఉప ఎన్నికలో ప్రజలు ఏ విధంగా తీర్పునిస్తారోనని ఎదురుచూస్తున్నారు. అలాగే కర్ణాటక రాష్ట్రంలో కొత్త సీఎం మారారు. ఇక్కడ రెండు అసెంబ్లీ సీట్లకు పోటీ జరుగుతోంది. ఇటీవల కాలంలో జరిగిన ఉప ఎన్నికల్లోకాంగ్రెస్ పుంజుకుంటోంది. దీంతో ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఎంత మేరకు ఉంటుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. దీంతో రాష్ట్రంలో జరిగే రెండు అసెంబ్లీ స్థానాల ఎన్నికలు ఉత్కంఠను రేపాయి.
అస్సాంలో ఐదుచోట్ల అసెంబ్లీ ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ లో 4 స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్లో మూడు, మేఘాలయలో మూడు, రాజస్థాన్లో రెండు, మహారాష్ట్ర, మిజోరాం, నాగాలాండ్, హర్యారా రాష్ట్రాల్లో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నారు. వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహిస్తున్నా ఇక్కడ గెలుపొందే నాయకులు రాబోయే భవిష్యత్తును మార్చనున్నట్లు తెలుస్తోంది. అలాగే మూడు లోక్ సభ స్థానాలకు కూడా జరిగే ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి.
ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పలుచోట్ల పోటీ చేస్తోంది. దీంతో ఇక్కడి తమ అభ్యర్థుల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ అభ్యర్థులు ఎక్కువ మంది గెలిస్తే బీజేపీపై నమ్మకం ఉందనే ప్రచారం చేయనుంది. దీంతో అభ్యర్థులు సైతం తాము గెలిచేలా రకరకాల వ్యూహాలు రచించారు. అయితే ప్రత్యర్థి పార్టీలు సైతం పోటా పోటీగా బరిలోకి దిగనున్నాయి. బీజేపీ వ్యతిరేకత ఏర్పడిందని చూపించడానికే తమ అభ్యర్థుల ద్వారా ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేయశాయి. అయితే ఓటర్లు తీసుకునే నిర్ణయంపై అంది దృష్టి కేంద్రీకృతమైంది.