Begin typing your search above and press return to search.

ప్రముఖ బంగారం వ్యాపారి ఇంట్లో ఐటీ సోదాలు.. వెయ్యి కోట్లకుపైగా బ్లాక్ మనీ సీజ్?

By:  Tupaki Desk   |   8 March 2021 1:30 AM GMT
ప్రముఖ బంగారం వ్యాపారి ఇంట్లో ఐటీ సోదాలు.. వెయ్యి కోట్లకుపైగా బ్లాక్ మనీ సీజ్?
X
ఐటీ అధికారుల దాడుల్లో పెద్ద చేప చిక్కింది. అలాంటి ఇలాంటి చేప కాదు.. ఏకంగా 1000 కోట్లకు పైగానే నల్లధనం బయటపడిందంటే ఎంత పెద్ద అవినీతి చేపనో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఓ ప్రముఖ బంగారం వ్యాపారి నివాసాలు, కార్యాలయంలో నిర్వహించిన సోదాల్లో భారీగా సొత్తు బయటపడింది.

మార్చి 4న తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో 27 చోట్ల సోదాలు నిర్వహించినట్లు సీబీడీటీ ప్రకటించింది. లెక్కచూపని నగదు లావాదేవీలు, బోగస్ రుణ చెల్లింపులు, అడ్వాన్స్ కొనుగోళ్ల రూపంలో రుణ చెల్లింపుల డమ్మీ ఖాతాలు, నోట్ల రద్దు సందర్భంగా ఖాతాల్లో డిపాజిట్ చేసిన లెక్క తేలని డబ్బు, వివరాలను స్టాక్ లను గుర్తించినట్లు పేర్కొంది.

బంగారం కొనుగోళ్లలోనూ అక్రమాలకు పాల్పడినట్టు వెల్లడించింది. అప్పులున్నట్లు తప్పుడు ప్రకటనలు ఇచ్చి పాత బంగారాన్ని నగల తయారీ, ఇతర అంశాలకు వాడుకున్నట్టు చెప్పాడని పేర్కొంది.

వ్యాపారి నుంచి రూ.1000 కోట్లకు పైగానే నగదు స్వాధీనం చేసుకున్నామని ఐటీ శాఖ తెలిపింది. అయితే ఆ వ్యాపారి ఎవరనేది పేరు బయటపెట్టడం లేదు. వ్యాపారి దక్షిణాదికి చెందిన ప్రముఖుడనే ప్రచారం సాగుతోంది.