Begin typing your search above and press return to search.
ఐటీ ఉద్యోగాలు ఎంత రిస్క్‌లో ఉన్నాయో!
By: Tupaki Desk | 18 Sep 2017 6:26 AM GMTఇటీవలి కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తున్న ఐటీ ఉద్యోగాలపై మరో దుర్వార్త వెలువడింది. వివిధ రంగాల్లో పని చేసే వారు తమ నైపుణ్య కొరత కారణంగా వచ్చే ఐదేళ్లలో భారీగా ఉద్యోగాలు కోల్పోనున్నారని ఫిక్కీ ఒక నివేదికలో తెలిపింది. నైపుణ్యం కొరత కారణంగా వచ్చే అయిదేళ్లలో అంటే 2022 నాటికి ఏకంగా 21 శాతం మంది కొలువులు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉందని ఫిక్కీ విశ్లేషించింది. ఉద్యోగాల కల్పనపై ఫిక్కీ 132 పేజీల రిపోర్టును విడుదల చేసింది. నైపుణ్యత పెంచే విద్యా మెలుకువలు అవసరమని నొక్కి చెప్పింది. లేకపోతే భవిష్యత్‌లో మనుగడ కష్టసాధ్యమని తేల్చిచెప్పింది.
ఫిక్కీ రిపోర్టు ప్రకారం.. దేశంలో జనాభాపరమైన మార్పులు, ప్రపంచీకరణ, భారతీయ పరిశ్రమల ఆధునిక సాంకేతికీకరణ లాంటి వివిధ అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ సంస్థలు - విద్యాసంస్థలు ఇతర పరిశ్రమలు ఈ దిశగా కృషి మొదలు పెట్టాలని తెలిపింది. 2022 నాటికి ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నలాజీ (ఐటీ) రంగంలో అత్యధిక ఉద్యోగాలు ఊడొచ్చని అంచనా వేసింది. ప్రధానంగా ఈ రంగంలో నైపుణ్యం పెంపునకు అత్యధిక అవశ్యకత ఉందని స్పష్టం చేసింది. వచ్చే ఐదేళ్లలో 20-30 శాతం ఐటీ రంగ ఉద్యోగులు ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు సైతం ఎక్కువగా ఉన్నాయని వివరించారు. ముఖ్యంగా ఈ రంగంలో విఎఫ్ ఎక్స్ గ్రాఫిక్స్ - వైర్ లెస్ నెట్ వర్క్ - నిపుణులు - డేటా ఎనలిస్టులు - యాండ్రాయిడ్ డెవలపర్ తదితర కేటగిరీల్లో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయని అంచనా వేసింది. భవిష్యత్తులో దేశంలో ఉద్యోగాల కల్పనలో ఆన్ లైన్ - ఎక్స్ పోనెన్షియల్ టెక్నాలజీ రంంలో విస్తృతావకాశాలు ఉంటాయని ఈ రిపోర్టు విశ్లేషించింది. టెక్నాలజీ ఎగ్రిగేటర్ మోడల్ ఉబెర్ లాంటివి రెండవ కీలక రంగంగా ఉండొచ్చు. జనరల్ - టెక్నికల్ - వత్తిపరమైన విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు తీసుకురావాలని, ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. అదే విధంగా వస్త్ర - ఆటోమొబైల్ - రిటైల్ - సైబర్ సెక్యూరిటీ వంటి ఇతర రంగాల్లోనూ వేగంగా మార్పులు జరగనున్నాయని తెలిపింది.