Begin typing your search above and press return to search.
కరోనాను పుట్టించిన చైనా .. ఆధారాలు మాయం చేస్తుందట !
By: Tupaki Desk | 26 Jun 2021 12:30 AM GMTప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి ఎక్కడ పుట్టింది అని అడగ్గానే ప్రతి ఒక్కరూ చైనా అనే చెప్తారు. అయితే , కరోనా మహమ్మారి పుట్టుకకి చైనానే అని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు మాత్రం లేవు. ఇంకా ఇది మిస్టరీగానే ఉంది. అయితే, వూహాన్ ల్యాబ్ నుంచే వైరస్ లీక్ అయిందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అందుకు బలాన్నిచ్చే సమాచారాన్ని కప్పిపుచ్చేందుకు చైనా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కరోనా జన్యుక్రమానికి సంబంధించిన తొలినాళ్ల నివేదికలను అంతర్జాతీయ డేటాబేస్ నుంచి చైనా తొలగిస్తున్నట్లు సమాచారం.
కరోనా వైరస్ మూలాల పై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి దర్యాప్తునకు సిద్ధమవుతోన్న వేళ చైనా యత్నాలను అమెరికా శాస్త్రవేత్తలు మరోసారి బయటపెట్టారు. కరోనా వైరస్ విజృంభించిన తొలినాళ్లలో చైనా విడుదల చేసిన వైరస్ టెస్ట్ సీక్వెన్సులను అంతర్జాతీయ డేటాబేస్‌ల నుంచి తొలగిస్తున్నట్లు అమెరికాలో ప్రముఖ వైరాలజిస్ట్ జెస్సీ బ్లూమ్ తెలిపారు. ముఖ్యంగా కరోనా మూలాలు కనిపించకుండా చేసేందుకే నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ కు సంబంధించిన ‘సీక్వెన్స్ రీడ్ ఆర్కైవ్ నుంచి వాటిని తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. వైరస్ వెలుగుచూసిన సమయంలో వుహాన్‌లో నమోదైన కేసులకు సంబంధించిన నమూనాల సమాచారమే తొలగించిన వాటిలో ఎక్కువగా ఉందన్నారు. కొవిడ్ మూలాలు, విస్తృతిని అర్థం చేసుకోవడంలో అత్యంత కీలకమైన ఇటువంటి డజనుకుపైగా నివేదికలను చైనా తొలగించినట్లు తెలిపారు. వైరస్ పరిణామ క్రమంపై గందరగోళం సృష్టించడానికే చైనా ఈ పన్నాగాలు పన్నినట్లు భావిస్తున్నామన్నారు. వుహాన్‌లోని స్థానిక మార్కెట్లో కరోనా వైరస్ వెలుగుచూడక ముందే నగరంలో పలుచోట్ల వైరస్ ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. చైనాలోని ల్యాబ్ నుంచే కరోనా పుట్టిందని అమెరికా మొదట్నుంచి ఆరోపిస్తోంది. చాలా దేశాలది ఇదే వాదన. అయితే డ్రాగన్ దేశం మాత్రం దీన్ని ఒప్పుకోవడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అది నిజం కాదని అంటోంది. జంతువు, పక్షి నుంచి వ్యాపించి ఉండొచ్చని భావిస్తోంది. వైరస్ పుట్టుకపై దర్యాప్తు కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో అమెరికా వైరాలజిస్ట్ జెస్సీ బ్లూమ్ చేస్తున్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.