Begin typing your search above and press return to search.

మాఘమాసం ఎప్పుడొస్తుందో?

By:  Tupaki Desk   |   1 Jan 2022 9:32 AM GMT
మాఘమాసం ఎప్పుడొస్తుందో?
X
మాఘ మాసం ఎప్పుడొస్తుందో.. మంత్రి వ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ ఎప్పుడు జ‌రిగేనో అని టీఆర్ఎస్ నేత‌లు పాట పాడుకుంటున్నార‌ని టాక్‌. ముంద‌స్తు ఎన్నిక‌ల‌తో సంబంధం లేకుండా కేసీఆర్ త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌డ‌తార‌ని తెలుస్తోంది. దేనికైనా మంచి ముహూర్తం చూసుకునే ఆయ‌న‌.. ఈ కేబినేట్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌కు మాఘ మాసం స‌రైంద‌ని అనుకుంటున్నార‌ని తెలిసింది. అందుకే మాఘ మాసం ఎప్పుడొస్తుందో అని టీఆర్ఎస్ నాయ‌కులు ఎదురు చూస్తున్నార‌ని టాక్‌.

తెలంగాణ‌లో రాజ‌కీయాలు ఒక‌ప్ప‌టిలా లేవు. ఇప్పుడు పోరు హోరాహోరీగా మారింది. టీఆర్ఎస్‌కు స‌వాలు విసిరేందుకు బీజేపీ, కాంగ్రెస్ బ‌లంగా మారుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ ప్ర‌ధాన పోటీదారుగా ఎదిగే దిశ‌గా వేగంగా సాగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక విజ‌యం ఆ పార్టీకి మ‌రింత నైతిక స్థైర్యాన్ని అందించింద‌నే చెప్పాలి. దీంతో క‌ష్ట‌ప‌డితే తెలంగాణ‌లో టీఆర్ఎస్‌ను ఓడించ‌డం సాధ్య‌మేన‌న్న భావ‌న‌తో బీజేపీ దూసుకెళ్తోంది.

దీంతో ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు ఎలా క‌ళ్లెం వేయాలో అని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న కేసీఆర్‌.. మ‌రోవైపు ప్ర‌భుత్వంపై కూడా దృష్టి సారించారని తెలిసింది. ఇప్ప‌టికే వ‌రి కొనుగోళ్ల విష‌యంలో బీజేపీని ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీని ఎదుర్కోవ‌డమే ల‌క్ష్యంగా కేసీఆర్ మంత్రివ‌ర్గాన్ని పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

ఇప్ప‌టికే కేసీఆర్ మ‌రోసారి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్పుడున్న మంత్రి వ‌ర్గంతో కాకుండా కొత్త‌గా మార్పులు చేర్పులు చేసి స‌రికొత్త టీమ్‌తో ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. అందుకే కేబినేట్‌లో ఎవ‌రిని చేర్చాలి.. ఎవ‌రిని త‌ప్పించాలి అనే విష‌యంపై కేసీఆర్ ఇప్ప‌టికే ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చార‌ని తెలిసింది.

క‌లెక్ట‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయిన వెంక‌ట్రామిరెడ్డి, రాజ్య‌స‌భ ప‌ద‌వి వ‌దులుకుని వ‌చ్చి ఎమ్మెల్సీ అయిన బండా ప్ర‌కాష్‌ల‌ను మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటార‌నే టాక్ న‌డుస్తోంది. ఈ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ కోసం ఆయ‌న మాఘ మాస‌మైన ఫిబ్ర‌వ‌రిని ఎంపిక చేసుకున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఫిబ్ర‌వ‌రిలో మంత్రివ‌ర్గాన్ని విస్త‌రించి వ‌చ్చే ఎన్నిక‌లకు ఏ ర‌క‌మైన స‌మీక‌ర‌ణాల‌తో వెళ్లాలో అనే విష‌యంపై పార్టీకి ఓ స్ప‌ష్ట‌త‌నిచ్చే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు.