Begin typing your search above and press return to search.

గుడివాడ క్యాసినోపై ఐటీ న‌జ‌ర్.. టీడీపీ ఇచ్చిన ఆధారాలు ఇవే!

By:  Tupaki Desk   |   20 Dec 2022 2:30 AM GMT
గుడివాడ క్యాసినోపై ఐటీ న‌జ‌ర్.. టీడీపీ ఇచ్చిన ఆధారాలు ఇవే!
X
మాజీ మంత్రి కొడాలి నాని, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీల‌కు ఐటీ ఉచ్చు బిగుసుకుంటోందా? ఈ ఏడాది సంక్రాంతి స‌మ‌యంలో గుడివాడ అడ్డాగా నిర్వ‌హించిన క్యాసినోపై ఐటీ అధికారులు లోతుగా ద‌ర్యాప్తు ప్రారంభించారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. గుడివాడ క్యాసినోపై గతంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నేత‌లు ఆదాయ‌ప‌న్ను(ఐటీ) శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ ఇక్క‌డ జ‌రిగిన క్యాసినోపై దృష్టి పెట్టింది. ఈ క్ర‌మంలో త‌మ వ‌ద్ద ఉన్న ఆధారాల‌ను ఐటీ అధికారుల‌కు టీడీపీ నాయ‌కులు తాజాగా అంద‌జేశారు. దీంతో ఐటీ విచార‌ణ మ‌రింత ముమ్మ‌రం కానుంది.

గుడివాడ క్యాసినో ఆరోపణలకు సంబంధించిన వివరాలను తెలుగుదేశం బృందం.. ఐటీశాఖ అధికారులకు అందజేసింది. కొడాలి నాని, వల్లభనేని వంశీ నేతృత్వంలో క్యాసినో నిర్వహించారంటూ.. టీడీపీ గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌తోపాటు వివిధ కేంద్ర మంత్రిత్వశాఖలకు ఫిర్యాదు చేసింది. వాటికి సంబంధించిన వివరాలు అందించాలని.. వర్ల రామయ్యను ఆదాయపు పన్నుశాఖ కోరింది. ఈ వివరాలను అందించేందుకు వర్ల రామయ్య, బొండా ఉమ, కొనకళ్ల నారాయణ, రావి వెంకటేశ్వరరావు.. విజయవాడలోని ఐటీ కార్యాలయానికి వెళ్లారు.

పేరుకు ఎడ్ల పందాలు పెడుతున్నామని.. వెనక క్యాసినో నడిపారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. గుడివాడలో క్యాసినో నిర్వహిస్తున్నామని చికోటి ప్రవీణ్ ప్రచారం చేసిన ఆధారాలను ఐటీ అధికారులకు అందించామని ఆయన వెల్లడించారు. చికోటి ప్రవీణ్ తనకు స్నేహితుడేనని వంశీ స్వయంగా చెప్పారని ఆరోపించారు. ఈ వ్యవహరంలోకి కొడాలి నాని వేలాది మందిని రప్పించారని తెలిపారు. వేలకు వేలు ఎంట్రీ ఫీజులు పెట్టారని తెలిపారు.

గుడివాడ క్యాసినోలో దాదాపు 500 కోట్ల మేరకు ఆర్థిక లావాదేవీలు జరిగాయని అన్నారు. హవాలా రూపంలో ఆ నగదును దారి మళ్లించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. హవాలా సొమ్మును దారి మళ్లించేందుకు చికోటి సాయపడ్డారని.. దీనిలో ఎంత మొత్తం చేతులు మారాయనేది తమ వద్దనున్న వివరాలను ఐటీకి ఇచ్చామని తెలిపారు. క్యాసినో గురించి రాష్ట్ర అధికారులు ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. అందుకే కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.