Begin typing your search above and press return to search.
ఐటీ వర్సెస్ కమర్షియల్ టాక్స్ : కోమటిరెడ్డి టార్గెట్ ...?
By: Tupaki Desk | 15 Nov 2022 2:30 AM GMTఅపుడెపుడో తెలంగాణా సీఎం కేసీయార్ కి ఆనాటి ఏపీ సీఎం చంద్రబాబుకు మధ్య ఓటుకు నోటు కేసు వివాదం వచ్చింది. అది రచ్చ రచ్చ అయింది. అప్పట్లో చంద్రబాబు లౌడ్ వాయిస్ తో కేసీయార్ సర్కార్ మీద చేసిన కామెంట్స్ ఇప్పటికీ చాలా మందికి గుర్తుండి ఉంటాయి. మీకే సీఐడీ పోలీసులు ఉన్నారనుకోకండి మాకూ ఉన్నారు సీఐడీ బలగాలు. మాకూ అన్ని వ్యవస్థలూ బలగాలు ఉన్నాయి గుర్తు పెట్టుకోండి అంటూ ఒక స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు.
ఇపుడు సీన్ కొంచెం మారింది. కేంద్రంలోని బీజేపీకి, తెలంగాణాలోని టీయారెస్ సర్కార్ కి మధ్య ఇపుడు రాజకీయ రచ్చ సాగుతోంది. టీయారెస్ నేతలు టార్గెట్ గా ఐటీ దాడులు, ఈడీ దాడులు వరసబెట్టి చేయిస్తూ కేంద్రంలోని బీజేపీ దూకుడు చేస్తోంది అని టీయారెస్ నేతలు కుతకుతలాడుతున్నారు. అయితే వారి కుతకుతల నుంచి మంటల నుంచి ఒక వేడి ఆలోచన కూడా పుట్టింది.
అదే మా చేతిలో కూడా ఆయుధాలు ఉన్నాయని గులాబీ ముళ్ళు ఏంటో చూపించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి జంప్ చేసి మునుగోడులో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టార్గెట్ గా టీయారెస్ సర్కార్ ఇపుడు కమర్షియల్ టాక్స్ అనే ఆయుధాన్ని తీసింది. మీరు ఐటీ దాడులు చేయిస్తే మేము కూడా కమర్షియల్ టాక్స్ తో రెడీ అంటూ ఢీ కొడుతోంది.
ఏకంగా కోమటిరెడ్డి సంస్థ అయిన సుశీ ఇన్ ఫ్రా మీద గురి పెట్టి మరీ దాడులకు రెడీ అయిపోయింది. కమర్షియల్ టాక్స్ అధికారులు తాజాగా 150 మంది పదిహేను బృందాలుగా విడిపోయి మరీ సుశీ ఇన్ ఫ్రా సంస్థ మీద దాడులు చేపట్టారు. సుశీ ఇన్ ఫ్రా సంస్థ ఈ మధ్య బాగా పేరు నలిగింది. ఇది కోమటిరెడ్ది కుటుంబానికి చెందినది. ఈ సంస్థకే కేంద్రం 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చినందువల్లనే బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డి జంప్ అయ్యారని మొదటి నుంచి టీయారెస్ ఆరోపిస్తోంది.
ఇక ఉప ఎన్నికల్లో కూడా జనాలకు పంచడానికి ఈ సంస్థ నుంచే కోట్లు బయటకు తరలించారని టీయారెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే ఆధారాలు లేవు అంటూ ఈసీ ఆ కేసుని వదిలేసింది. ఇపుడు ఎటూ ఉప ఎన్నికలు అయ్యాయి కాబట్టి లోగుట్టు ఏంటో తామే తవ్వి తీయాలని టీయారెస్ సర్కార్ పంపున కమర్షియల్ టాక్స్ అధికారులు రంగంలోకి దిగిపోయారు అని అంటున్నారు.
ఇలా తమను కేంద్రం ఐటీతో గుచ్చి గుచ్చి సాధిస్తూంటే తాము ఊరుకుంటామా తమ పుట్టలో వేలుపెడితే కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ తో తామూ గట్టిగానే కుట్టేయగలమని హెచ్చరించడానికి జస్ట్ శాంపిల్ అన్నట్లుగా కోమటిరెడ్డి ఫ్యామిలీ మీద దండెత్తింది అని అంటున్నారు. దీని మీద బీజేపీ నేతలు మండుతున్నారు.
కేంద్ర సంస్థలు తమ మీద దాడులు చేస్తూంటే దాని కప్పిపుచ్చుకోవడానికి తమ వద్ద ఉన్న వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు అని ఫైర్ అవుతున్నారు బీజేపీ నేతలు. చిత్రమేంటి అంటే టీయారెస్ నేతలు మాత్రం గమ్మున ఉన్నారు. ఈ దాడుల వ్యవహారం మీద ఎవరూ నోరు విప్పడంలేదు.
అయితే ఇది ఇక్కడితో ఆగుతుందా లేక ఇంకా ఏమైనా దాడులు జరుగుతాయా అన్నది మాత్రం ఆసక్తిగా ఉంది. కేంద్ర బీజేపీ పెద్దల వద్ద టీయారెస్ నేతల లిస్ట్ ఉంటే ఇపుడు టీయారెస్ వారు కూడా మరో లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. చూడాలి మరి ఈ దాడుల రాజకీయం ఎంతదూరం వెళ్తుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.