Begin typing your search above and press return to search.
శిశువు విక్రయం కేసులో భారీ ట్విస్ట్ ... పుట్టకముందే లక్షకి బేరం !
By: Tupaki Desk | 31 Oct 2020 5:10 PM GMTపసి పిల్లలని దేవుళ్లతో సమానంగా చూస్తారు. కానీ, హైదరాబాద్ లో ఓ పసిబిడ్డను కడుపులో ఉండగానే తల్లిదండ్రులు అమ్మకానికి బేరం పెట్టారు. దీనితో ఈ కేసులో అసలు ట్విస్ట్ బయటపడటంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటన లో పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ఈ కేసు విచారణ వేగవంతం చేసిన నాచారం పోలీసులు .. కొన్ని సంచలన నిజాలని బయటపెట్టారు. పోలిసుల విచారణలో డబ్బుల కోసమే శిశువును విక్రయించినట్టుగా తేల్చారు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే బాబు పుట్టకముందే విక్రయించాలని నిర్ణయానికి వచ్చి లక్ష రూపాయలకు డీల్ కుదుర్చుకున్నారు. బాబు పుట్టకముందరే లక్ష రూపాయలకు రాజేష్ దంపతులతో డీల్ కుదుర్చుకుని, ముందే 50 వేలు అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు గుర్తించారు. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో, మూడోసారి కూడా ఆడపిల్లే పుడుతుందని భావించిన అమ్మకం పెట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. కానీ, బాబు పుట్టడంతో ముందుగా కుదిరిన డీల్ కంటే మరో నాలుగు లక్షలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ డీల్ కు జానకి అలియాస్ ఝాన్సీ మధ్యవర్తిత్వం వహించగా రాజేష్, నవీన దంపతులు కొన్నారు. అయితే, అదనంగా రూ.4 లక్షలు ఇవ్వడానికి మాత్రం రాజేష్ దంపతులు అంగీకరించలేదు. దీంతో 4 నెలల తర్వాత పోలీసులకు బాబు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగుచూసింది. ఈ కేసులో మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు బాబు తల్లిదండ్రులు మీనా, వెంకటేష్ తో పాటు మధ్యవర్తి జానకి, బాబును కొన్న రాజేష్ ను కూడా అరెస్ట్ చేశారు నాచారం పోలీసులు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.