Begin typing your search above and press return to search.
భారత ఆర్మీకి నేపాల్ ఆర్మీ యతి పంచ్!
By: Tupaki Desk | 3 May 2019 6:10 AM GMTఅవసరానికి మించిన ఉత్సాహం ఏ మాత్రం మంచిది కాదు. ఏదైనా విషయం మీద అభిప్రాయాన్ని చెప్పదలిస్తే.. ఆ విషయం మీద లోతైన మధనం జరగాలి. అప్పుడు కానీ.. పెదవి విప్పకూడదు. కానీ.. ఆ విషయాన్ని పట్టించుకోకుండా.. తమ వాళ్లు చెప్పారంటే.. వెనుకా ముందు చూసుకోకుండా కాల్పనిక క్యారెక్టర్ నిజంగానే ఉందంటూ హడావుడి చేసిన భారత ఆర్మీ సోషల్ మీడియా పోస్ట్ మీద జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు.
తమ సైనికుల బృందం హిమాలయాల్లో పర్యటించిన సందర్భంగా.. వారు యతి (పురాణాల్లో ప్రముఖంగా ప్రస్తావించే మంచు మనిషి)కి సంబంధించిన అడుగుజాడల్ని చూసినట్లుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో ప్రముఖుంగా పోస్ట్ చేశారు. దీంతో.. ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
32 అంగుళాల పొడవు.. 15 అంగుళాల వెడల్పుతో ఉన్న ఈ పాదముద్రలు కచ్ఛితంగా యతివే అయి ఉంటాయని ఆర్మీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. అయితే.. ఫోటోలో ఒక కాలు పాద ముద్రలు ఉండటంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఇదిలాఉంటే.. భారత ఆర్మీ పోస్ట్ చేసిన ఫోటోల్ని శాస్త్రవేత్తలు.. పరిశోధకులు ఖండిస్తుండగా.. తాజాగా నేపాల్ ఆర్మీ కూడా ఖండన ప్రకటన చేసింది. అవి యతి పాదముద్రలు కావని.. ఎలుగుబంటి పాదముద్రలని.. ఆ ప్రాంతంలో అలాంటివి తరచూ కనిపిస్తుంటాయని నేపాల్ ఆర్మీ బ్రిగేడియర్ జనరల్ విజ్ఞాన్ దేవ్ పాండే వెల్లడించారు. భారత ఆర్మీ ఉన్న ప్రాంతానికి దగ్గర్లోనే నేపాల్ ఆర్మీకి చెందిన లియైజన్ బృందం కూడా ఉందని.. వారు కూడా ఈ పాదముద్రల్ని గుర్తించారని.. అవి యతివి కావు.. ఎలుగుబంటివి అంటూ తేల్చేశారు. అందుకే.. కొత్త విషయాల్ని ప్రకటించే ముందు శాస్త్రీయత ఎంతన్నది తేల్చుకున్నాకే వెల్లడించాలి. ఒక సాధారణ వ్యక్తి పోస్ట్ చేసినట్లుగా భారత ఆర్మీ ఇలా పోస్ట్ చేయటాన్ని ఏమనాలి? దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు?