Begin typing your search above and press return to search.

అదానీకి డబ్బులు ఇచ్చి కంపెనీ పెట్టించిన బీజేపీ సర్కార్?

By:  Tupaki Desk   |   29 Dec 2022 1:43 PM GMT
అదానీకి డబ్బులు ఇచ్చి కంపెనీ పెట్టించిన బీజేపీ సర్కార్?
X
దేశంలో వెలుగులు ఉన్నాయి. అయితే అవి నూటా నలభై కోట్ల మంది ఇంట్లో కనిపిస్తున్నాయా అంటే జవాబు లేదు. కేవలం అతి కొద్ది మంది కార్పోరేట్ శక్తుల ఇళ్లలో కళ్లలోనే ఆ వెలుగులు ఉన్నాయి అని చెప్పకతప్పదు. ప్రభుత్వాలు కార్పోరేట్ శక్తులకు దాసోహం అంటూ ప్రజల రెక్కల కష్టంతో దేశంలో దశాబ్దాలుగా దేశం సంపాదించుకున్న ఆస్తులను ఒక్క లెక్కన అప్పగించడం అంటే అది దారుణం అన్న మాట ఎపుడూ విపక్షాల నోటి నుంచి వినిపిస్తూనే ఉంటుంది.

ఒక వైపు చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ తమ వారికి వాటిని అప్పగిస్తూ అంతా కార్పోరేట్ మయం చేస్తున్న బీజేపీ వారు ఇపుడు తమ అనుకూలుడు తమ వాడు అయిన అదానీ చేత డబ్బులు ఇచ్చి మరీ కంపెనీ పెట్టిస్తున్నారా అన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే దేశంలో ప్రస్తుతం ఉన్న విద్యుత్ మీటర్ల స్థానంలో ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు అమర్చాలని కేంద్రం చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్న సంగతి విధితమే. దీని మీద విపక్షాల నుంచి విమర్శలు పెద్ద ఎత్తున వచ్చినా కూడా కేంద్రం మాత్రం ముందుకే పోతామని దూకుడు చేస్తోంది.

ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు అంటే డబ్బు ముందుగా కట్టాలి. అపుడే కరెంట్ వస్తుంది. కరెంట్ వాడేసుకుని డబ్బులు కట్టకుండా చేయడం కాదు, అంటే డబ్బు ఉంటేనే వెలుగు ఉంటుంది. మరి పేదవారి వద్ద మిడిల్ క్లాస్ వద్ద డబ్బులు సకాలంలో లేకపోతే ఇక వారి ఇంట్లో అంధకారం రాజ్యమేలుతుంది అన్న మాట.

అదే విధంగా విద్యుత్ సంస్థలకు పైసా కూడా నష్టం లేకుండా ఉంటుంది. అలాగే విద్యుత్ సంస్థలు పెట్టే ఇబ్బందులు సమస్యలు కష్టాలు ఎన్ని ఉన్నా ముందే డబ్బు వారికి అప్పగించి కూర్చోవడం వల్ల వినియోగదారుల హక్కులు సేవలు అన్నీ కూడా పక్కకు పోతాయన్న మాట. ఈ విషయంలో వద్దు అనే విపక్షాలు అంటున్నా కేంద్రం మాత్రం ఇది మంచి విధానం సంస్కరణ అని అంటోంది.

ఇపుడు మరో అడుగు ముందుకు పడింది. ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం గౌతం అదాని ఈ ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్ల కోసం ఒక కంపెనీనే ఏకంగా ఏర్పాటు చేశారు. బెస్ట్ స్మార్ట్ మీటగింగ్ లిమిటెడ్ పేరిట ఆయన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. ఇక విద్యుత్ సంస్కరణలలో భగంగా 2025-26 నాటికి దేశమంతా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడానికి కేంద్రం ప్రణాళికలను సిద్ధం చేసింది.

అలా కేంద్రం ఆలోచనలు ఉండగానే ఇలా అదానీ తన కంపెనీని స్టార్ట్ చేయడంతో అంతా బీజేపీ చేత బీజేపీ వలన ఏర్పాటు చేసిన కంపెనీ ఇదేనా అని సెటైర్లు వేస్తున్నారు. ఇక స్మార్ట్ మీటర్ల కనెక్షన్ల కోసం ఇప్పటికే కేంద్రం.1.15 లక్షల కోట్లను మంజూరు చేసింది. అంటే కేంద్రం డబ్బులతో ఈ కంపెనీ ఏర్పాటు అవుతోంది అన్న విమర్శలకు అర్ధం ఉన్నట్లేనా అని అంతా అంటున్నారు. ఏది ఏమైనా అంతా అదానీ మయం అని అనుకోవాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.