Begin typing your search above and press return to search.
కరోనా వేళ గాంధీ సర్వే వివరాలు తెలిస్తే అవాక్కే
By: Tupaki Desk | 6 March 2021 5:31 AM GMTఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా నాలుగువేల మందితో తెలంగాణ కరోనా నోడల్ ఆసుపత్రిగా ప్రకటించిన గాంధీ కీలక సర్వే నిర్వహించింది. వైద్యులు.. వైద్య సిబ్బంది.. రోగులు.. ఇలా దాదాపు నాలుగు వేలమంది మానసిక పరిస్థితిపై సర్వేను నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. కరోనాతో బాధ పడిన వారు.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి మానసిక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారన్న విషయాన్ని సర్వే ఫలితం కళ్లకు కట్టేలా చేసిందని చెప్పక తప్పదు. గాంధీ ఆసుపత్రికి చెందిన సైకియాట్రిస్టు డాక్టర్ అజయ్ ఈ సర్వేను చేపట్టారు.
తొలి విడతలో భాగంగా 18 ప్రశ్నలతో 800 మంది కరోనా రోగులపై అధ్యయనం నిర్వహించారు. కరోనా సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయాలపై ఆరా తీశారు. ఎలాంటి ఆందోళన ఎదురవుతోంది? ఎటువంటి భయాలు పీడిస్తున్నాయి? కుంగిపోయినట్లు అనిపిస్తోందా? మానసిక స్థితి ఎలా ఉంది ? ఇతర విషయాలపై ఆసక్తి తగ్గిందా? పెరిగిందా ? ఎనర్జీ ఏ స్థాయిలో ఉంది ? నిద్ర వస్తోందా ? అర్థరాత్రి అకస్మాత్తుగా మెలకువ వస్తోందా ? ఏదీ తినాలని అనిపించడం లేదా ? ఇలా వివిధ ప్రశ్నలతో రోగులను సర్వే చేశారు.
ఈ సర్వేలో సగానికి పైనే తాము మానసిక సమస్యల్ని ఎదుర్కొన్న విషయాన్ని తెలియజేశారు. రోగ లక్షణాలు తక్కువగా ఉన్న ఒక ఐటీ ఇంజనీర్.. కుటుంబానికి దూరంగా ఒక హోటల్ లో బస చేసిన వేళలో.. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా వచ్చేవి. దీంతో.. గాంధీని సంప్రదించటంతో వారు అతనికి ప్రత్యేకంగా చేర్చుకొని చికిత్స చేశారు. సర్వేలో పాల్గొన్న ప్రతి వంద మందిలో 50-60 మంది యాంగ్జయిటీతో సతమతమయ్యారని తేల్చారు.
మరో 20 శాతం మంది డిప్రెషన్ తో ఇబ్బంది పడ్డారు. 10 శాతం మంది అక్కహాల్ విత్ డ్రాయల్ సిండ్రోమ్ తో ఇబ్బందికి గురైతే.. రెండు శాతం మంది సైకోసిస్ తో ఇబ్బంది పడినట్లుగా తేలగా.. మరో 8 శాతం మంది ఇతరత్రా మానసిక సమస్యల్ని ఎదుర్కొన్నట్లుగా తేలింది.
కరోనా తగ్గి ఇంట్లో ఉన్న వేళలో వారి ప్రవర్తన.. మానసిక పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకునేందుకు వెయ్యి మందిపై అధ్యయనం చేశారు. ఇందులో 400 నుంచి 500 మంది వరకు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ తో బాధపడుతున్నట్లుగా గుర్తించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందిన రోజుల్ని గుర్తుకు తెచ్చుకొని బాధ పడటం.. ఒంటరిగా మిగిలామనే భావనతో ఆందోళన చెందటం లాంటి సమస్యల్ని వారు ఎదుర్కొన్నట్లుగా తేలింది.
ఎవరో తమను చంపుతామన్న భావన కలగటం.. తామే ఆత్మహత్య చేసుకోవాలని అనిపించటం.. వింతవింతగా ప్రవర్తించటం లాంటి సమస్యల్ని గుర్తించారు. చాలామందిలో సైకోసిస్ డిజార్డర్ ను ఎదుర్కొన్నట్లుగా నిర్థారించారు. అధ్యయనంలో భాగంగా వైద్యులు.. వైద్య సిబ్బందికి ప్రశ్నల్ని సంధించారు. ఈ సందర్భంగా అధ్యయనంలో పాల్గొన్న వైద్యుల్లోని 35 శాతం మందిలో అక్యుట్ స్ట్రెస్ రియాక్షన్ ను ఎదుర్కొన్నట్లుగా తేలింది.
రోగులకు ఎలాంటి చికిత్స అందించాలి? వారుఏ మేరకు సహకరిస్తారు? మాకు వైరస్ వస్తే పరిస్థితి ఏమిటి? ఎంత ధైర్యం చేసి ముందుకు వెళ్లినా కరోనాను ఎదుర్కోవటం సులభమేనా? లాంటి ఒత్తిళ్లతో వైద్య సిబ్బంది తీవ్ర మానసిక క్షోభకు గురైనట్లుగా గుర్తించారు. చాలామందిలో నిద్ర పట్టకపోకుండా అవే భయాలు.. ఆందోళనలతో రోజులు గడిపినట్లుగా గుర్తించారు.
మానసికసమస్యల్ని ఎదుర్కొన్న వారికి సంబంధించిన ఎంతటి తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కొన్నరన్న విషయాల్ని తెలియజేసే ఉదంతాన్ని ఈ అధ్యయనంలో వివరించారు. జులైలో కరోనా చికిత్స అనంతరం గాంధీ నుంచి డిశ్చార్జి అయిన మహిళ ఇంటికి చేరారు. తర్వాతి రోజు నుంచి ఆమె చిత్రవిచిత్రంగా వ్యవహరించటం మొదలు పెట్టారు. తనను ఎవరో చంపటానికి వస్తున్నారని ఇంటి తలుపులు మూసేవారు. ఇంట్లో ఉన్నవాషింగ్ మెషీన్ మూత తీసి అందులో కూర్చునేవారు. పక్క గదిలో ఉన్న భర్త.. ఆమె కేకలకు హాల్లోకి వచ్చి చూడగా ఆమె వాషీంగ్ మెషిన్ లో కూర్చొని ఉన్నారు. వెంటనే.. గాంధీ వైద్యులకు ఫోన్ చేసి.. పరిస్థితిని వివరిస్తే.. ఆమె మానసిక ఆరోగ్య పరిస్థితిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రయాణించిన క్యాబ్ డ్రైవర్ కరోనాతో చనిపోయాడని.. అతడి వల్లే తనకు కరోనా వచ్చిందని.. అతడొచ్చి తనను చంపేస్తాడని పదే పదే ఆలోచించి మానసిక వ్యధకు గురైనట్లుగా గుర్తించి.. ఆమెకు వైద్యం చేసిన నయం చేశారు. ఇలాంటి ఉదంతాలెన్నో గాంధీలో చోటు చేసుకున్నాయట.