Begin typing your search above and press return to search.
రష్యా వ్యాక్సిన్‌పై మరో పేచీ.. డేటాలో తేడాలున్నయట!
By: Tupaki Desk | 11 Sep 2020 12:30 AM GMTప్రపంచంలోనే తొలిసారిగా కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టింది మేమేనంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్.. స్పుత్నిక్- వీ అనే వ్యాక్సిన్‌ను ప్రకటించాడు. వ్యాక్సిన్‌ను విడుదల చేయడమే కాక దాన్ని స్వయంగా తన కూతురుకే ఇప్పించి సంచలనం సృష్టించాడు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కూడా జరుపని ఈ వ్యాక్సిన్‌పై మొదటి నుంచి పలువురు శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఇటీవల ప్రముఖ మెడికల్ జర్నల్ ల్యాన్సెట్ రష్యాపై ఓ సంచలనాత్మక కథనం ప్రచురించింది. రష్యా వ్యాక్సిన్‌పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆ వ్యాక్సిన్ ఎంతో సేఫ్ అని ఆ కథనంలో పేర్కొన్నారు. అంతేకాక వ్యాక్సిన్ ఇచ్చిన వారందరిలోనూ యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతున్నాయని కూడా ఆ కథనంలో పేర్కొన్నారు.
అయితే ఆ కథనంపై ప్రస్తుతం ఇటలీ శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేశారు. ‘స్పుత్నిక్-వి పేరుతో సమర్పించిన డేటా ను నమ్మలేం. రష్యా చెప్పినట్టు యాంటీబాడీలు ఉత్పత్తి కావడం అసాధ్యం’ అంటూ వారు ల్యాన్సెట్ జర్నల్ ఎడిటర్‌కు ఓ లేఖ రాశారు. వలంటీర్లలో ఒకే స్థాయిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్టు రష్యా పేర్కొనడంపై వారు సందేహం వ్యక్తం చేశారు. కాగా ఈ టీకాను రూపొందించిన గమెలేయా ఇన్‌స్టిట్యూట్ మాత్రం శాస్త్రవేత్తలు వాదనలను కొట్టిపారేసింది. ది లాన్సెట్ జర్నల్‌కు చెందిన ఐదుగురు విశ్లేషకులు సమీక్షకలను పరిశీలించారని ఇన్స్‌స్టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ డెనిస్ లోగునోవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటలీ శాస్త్రవేత్తలు ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రష్యాలో స్పుత్నిక్-వీ విడుదలైంది. ఈ వ్యాక్సిన్ సక్సెస్ నా.. ఫెయిల్యూర్ నా అనేది జనమే తేల్చనున్నారు.