Begin typing your search above and press return to search.

సెప్టెంబర్ దాకా లాక్ డౌనే.. ఎగ్జిట్ ప్లాన్ ఇదే

By:  Tupaki Desk   |   1 May 2020 11:31 AM GMT
సెప్టెంబర్ దాకా లాక్ డౌనే.. ఎగ్జిట్ ప్లాన్ ఇదే
X
కరోనాతో అపాన నష్టం చవిచూసిన దేశం ‘ఇటలీ’. లాక్ డౌన్ ను ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఇటలీ రూపొందించిన ఎగ్జిట్ ఫార్ములానే మన దేశం కూడా అమలు పరచడానికి రెడీ అయినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. దేశంలో ఇటలీలాగా వివిధ దశల్లో లాక్ డౌన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం అదే విధానాన్ని మన దేశం పాటించనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.

ఇటలీలో మే 3వ తేదీతోనే లాక్ డౌన్ ముగియనున్నది. ఫస్ట్ ఫేస్ లో లాక్ డౌన్ తో జీవించడం.. సెకండ్ ఫేస్ లో వైరస్ తోపాటు కలిసి జాగ్రత్తలు తీసుకుంటూ కొనసాగడాన్ని ఇటలీ అమలు చేసింది.

మే 4వ తేదీన ఇటలీలో లాక్ డౌన్ ఎత్తివేత ప్రక్రియ ప్రారంభం కానుంది. ఒకేసారి ఆంక్షలను ఎత్తివేయబోమని ఆ దేశం ప్రకటించింది. రోజువారీ మినహాయింపులతో లాక్ డౌన్ ను నెమ్మదిగా ఎత్తివేస్తామని ఇటలీ ప్రకటించింది.

మే 4వ తేదీనుంచి ప్రజలు సెల్ఫ్ డిక్లరేషన్ తో ఇతర ప్రాంతాల్లోకి వెళ్లవచ్చు. ఆన్ లైన్ ద్వారా బార్లు, రెస్టారెంట్ల లో అమ్మకాలకు అనుమతిస్తారు. అంత్యక్రియలకు 15మంది మించి హాజరుకావద్దు. మే 18 నుంచి రిటైల్ షాపింగ్, మ్యూజియం, లైబ్రరీలు, సాంస్కృతిక కేంద్రాలు ఓపెన్ చేస్తారు. జూన్ 1 నుంచి బార్లు, రెస్టారెంట్లు, హెయిర్ సెలూన్లు, వెల్ నెస్ సెంటర్లు తెరుస్తారు. సెప్టెంబర్ నెల నుంచి విద్యాసంస్థలను తెరవాలని.. సినిమాహాళ్లు, మత కార్యక్రమాలకు కూడా సెప్టెంబర్ లోనే అనుమతించాలని ఇటలీ నిర్ణయించింది.అయితే ఇవన్నీ ప్రజలు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తేనే షరతలు వర్తిస్తాయి.

పడిపోతున్న భారత జీడిపి.. ఆర్థిక వ్యవస్థ దృష్ట్యానే ఎకానమిస్టులు ఇటలీ మాదిరిగానే భారత్ లోనే క్రమంగా లాక్ డౌన్ ఎత్తివేయాలని నిర్ణయించాయి. మే 3 తర్వాత ప్రధాని మోడీ ఇదే నిర్ణయం తీసుకుంటారని సమాచారం.