Begin typing your search above and press return to search.

రెండు నెల‌లు క్వారంటైన్‌ లో ఉన్న యువ‌తికి పాజిటివ్‌

By:  Tupaki Desk   |   26 April 2020 7:44 AM GMT
రెండు నెల‌లు క్వారంటైన్‌ లో ఉన్న యువ‌తికి పాజిటివ్‌
X
క‌రోనా వైర‌స్ వ్యాప్తి విష‌యంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు కొత్త కొత్తవి వ‌స్తున్నాయి. ఇన్నాళ్లు క‌రోనా వైర‌స్ సోకి ఉంటే 14 రోజుల త‌ర్వాత బ‌య‌ట ప‌డుతుంద‌ని అన్ని అధ్య‌య‌నాలు నిరూపించాయి. అదే ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న స‌త్యం. కానీ ఇప్పుడు ఆ వైర‌స్ క‌నిపించే కాలం మ‌రింత పెరుగుతోంది. ఇది ఆందోళ‌న క‌లిగించే అంశం. ఇప్పుడు ఇట‌లీలో ఏకంగా ‌రెండు నెలల త‌ర్వాత క‌రోనా వైర‌స్ వెలుగులోకి రావ‌డం వైద్యారోగ్య శాఖ ప్ర‌తినిధులతో పాటు ప్ర‌పంచాన్ని నివ్వెర‌పోయేలా చేసింది. 60 రోజులుగా క్వారంటైన్‌ లో ఉన్న యువ‌తికి చివ‌ర‌కు క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో అక్క‌డి అధికారులు అవాక్క‌య్యారు.

కరోనా సోకకుండా ఇట‌లీలో 23 ఏళ్ల యువతి బ‌యాంస్ దొబ్రొయ్‌ రెండు నెల‌లుగా క్వారంటైన్‌ లో ఉంది. 60 రోజుల పాటు క్వారంటైన్‌ లో ఉన్న అనంత‌రం ఆమెకు క‌రోనా వైర‌స్ సోకింది. స్థానిక ప్రభుత్వ ఆస్ప‌త్రిలో 105 డిగ్రీల జ్వరంతో చేరింది. వైద్యులు ప‌రీక్షించి ఆమెకు క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు. ఆ ప‌రీక్ష‌ల్లో క‌రోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పటివరకు సుదీర్ఘ కాలం పాటు క్వారంటైన్‌ లో ఉన్న వారికి పాజిటివ్ ఎవరికీ రాలేదు. 4 వారాల త‌ర్వాత టెస్టు ఫలితాల్లో పాజిటివ్‌గా వ‌చ్చింది. వాస్త‌వంగా మార్చి 6వ తేదీన చికిత్స తీసుకుని ఇంటికి వెళ్లింది. మ‌ళ్లీ 57 రోజుల తర్వాత ఆమెకు ప‌రీక్షలు చేయ‌గా క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.