Begin typing your search above and press return to search.
బీజేపీని పొగిడింది.. పదవి పోగొట్టుకుంది
By: Tupaki Desk | 7 May 2017 11:29 AM GMTకొన్ని పార్టీల్లో చిన్న విషయాల్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. తాజాగా అలాంటిదే ఒక ఉదంతం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీలో చోటు చేసుకుంది. మాట వరసకు ఇంటికి వచ్చిన వారితో బీజేపీ పాలన గురించి రెండు మాటలు మాట్లాడరన్న కారణంతో పార్టీ పదవిని తొలగించారు. అదెలా జరిగిందంటే..
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మహిళా విభాగం చీఫ్ గా వ్యవహరిస్తున్నారు కమరున్నీసా. తిరూర్ లోని ఆమె ఇంటికి విరాళం కోసం వెళ్లిన బీజేపీ కార్యకర్తతో ఆమె మాట్లాడింది. ఈ సందర్భంగా కేరళతో పాటు.. మిగిలిన రాష్ట్రాల్లో పార్టీ వేగంగా అభివృద్ధి చెందుతోందని.. ప్రజలకు ఆ పార్టీ మేలు చేస్తుందని.. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ పార్టీ కృషి చేస్తుందన్న ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ మీద తనకెన్నో ఆశలు ఉన్నట్లుగా మాట్లాడారు. అంతే.. ఈ విషయం బయటకు రావటం.. ఆమెను పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవటం జరిగిపోయాయి.
తనపై వేటు వేసిన పార్టీపై ఒక్క వ్యతిరేక వ్యాఖ్య కూడా చేయని కమరున్నీసా.. తన వ్యాఖ్యల పట్ల ఆమె విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ఉదంతంపై స్పందించిన బీజేపీ.. ఆమెను పదవి నుంచి తొలగించటం అసహనంతో కూడిన చర్యగా అభివర్ణించారు. కమురున్నీసా వ్యాఖ్యలపై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీంతో.. తాను చేసిన తప్పును గుర్తించిన ఆమె.. తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేసి.. క్షమాపణలు చెప్పింది. అయినప్పటికీ.. ఆమెను క్షమించేందుకు పార్టీ ససేమిరా అనటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/