Begin typing your search above and press return to search.

అప్పులలో రికార్డు సృష్టిస్తున్న బాబు: ఐవీ రెడ్డి

By:  Tupaki Desk   |   18 Nov 2017 12:55 PM GMT
అప్పులలో రికార్డు సృష్టిస్తున్న బాబు: ఐవీ రెడ్డి
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప‌రిపాల‌న‌లో అవినీతి తారాస్థాయికి చేరిపోతోందని గిద్ద‌లూరు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్ద‌లూరు ఇంచార్జీ ఐవీ రెడ్డి ఆరోపించారు. బాబు అవినీతి - ఆశ్రిత‌ప‌క్ష‌పాత నిర్ణ‌యాల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా ఏపీ ప‌రువు పోతోంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇసుక క్వారీలు మొద‌లుకొని విద్యా వ్య‌వ‌స్థ వ‌ర‌కు చంద్ర‌బాబు పాల‌న‌లో అవినీతి జ‌ర‌గ‌ని రంగంల ఏదీ లేద‌న్నారు. వ్య‌వ‌స్థీకృత‌మైన అవినీతిలో ఏపీ ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నార‌ని ఐవీ రెడ్డి తెలిపారు.

`రాష్ట్రంలోని మంత్రులంతా ఏదో ఒక కుంభ‌కోణంలో కూరుకుపోయారు. కొంద‌రు ప్ర‌త్య‌క్షంగా కాగా మ‌రికొంద‌రు ప‌రోక్షంగా అవినీతికి పాల్ప‌డుతున్నారు. కొంద‌రు చాటుమాటుగా పాల్ప‌డుతుంటే...మరికొంద‌రు నిస్సిగ్గుగా అవినీతికి పాల్ప‌డుతున్నారు`` అని ఐవీరెడ్డి మండిప‌డ్డారు. త‌న బ‌డాయి ప‌నులతో - ప్ర‌చార ఆర్భాటంతో సీఎం చంద్ర‌బాబు రాష్ర్టాన్ని అప్పుల పాలు చేస్తున్నాడ‌ని ఆరోపించారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీ అప్పులు 16,000 ఉండ‌గా...ప్ర‌స్తుతం అవి 20,000 కోట్ల‌కు చేరాయి. రాష్ట్రం భ‌యంక‌ర‌మైన అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందని మండిప‌డ్డారు. అప్పులు తీసుకునేందుకు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ క్ర‌మంలో నియ‌మ నిబంధ‌న‌ల‌ను తుంగ‌లో తొక్కుతోంద‌ని ఆరోపించారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం విచ్చ‌ల‌విడి అప్పుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం సైతం గ‌మ‌నిస్తోంద‌ని ఐవీ రెడ్డి తెలిపారు. అప్పుల విష‌యంలో విశృంఖ‌ల‌త్వం స‌రికాద‌ని - స‌రైన క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్ప‌నిస‌రి అని కేంద్రం హెచ్చ‌రిస్తున్న విష‌యం గ‌మ‌నించాల‌న్నారు. క‌రికులం మార్పు విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం తీరు సరైంది కాద‌ని ఐవీ రెడ్డి వ్యాఖ్యానించారు. క‌రికులం మార్పు విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేయ‌డం కంటే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లోని మౌళిక వ‌స‌తుల‌ను మెరుగుప‌ర్చ‌డంపై శ్ర‌ద్ధ పెట్టాల‌ని అన్నారు.