Begin typing your search above and press return to search.
వైఎస్ ఆర్ కు భారతరత్న ఇవ్వాలి: ఐవి రెడ్డి
By: Tupaki Desk | 6 Jun 2017 10:02 AM GMTమహానేత దివంగత డాక్టర్ వైఎస్ ఆర్ రాజశేఖర్ రెడ్డి గారికి భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవించాలని, అంతటి మహోన్నతమైన వ్యక్తిని ఈ విధంగానైనా మరోసారి గుర్తించడం కనీస బాధ్యత అని గిద్దలూరు వైఎస్ ఆర్ పార్టీ సమన్వయకర్త ఐవి రెడ్డి అన్నారు. నిన్న విట్టా సుబ్బరత్నమ్మ కళ్యాణ మంటపంలో జరిగిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు ప్రాంతాల వారిగా భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంతో కళకళలాడాలని తాపత్రయపడుతూ ఎన్నో గొప్ప సంక్షేమ పధకాలు తీసుకురావడమే కాక అవి ప్రతి ఒక్కరికి చేరేలా ఆయన కృషి ఎన్నటికి మర్చిపోలేనిదని అన్నారు. అధికార టిడిపి ప్రభుత్వం రాకముందు రాజశేఖర్ రెడ్డి గారి పాలనలో ఎవరికి ఏ చిన్న లేదా పెద్ద జబ్బు చేసినా ఆరోగ్యశ్రీ రూపంలో వాళ్ళను ఆదుకోవడానికి సంజీవిని లాంటి పధకాన్ని తీసుకొచ్చింది ఆయనేనని, అప్పుడు ప్రాణాలు నిలుపుకున్న ఎందరో నేడు వాళ్ళ కుటుంబాలకు ఆసరాగా నిలవడాన్ని ప్రతి ఊరిలోనూ చూడవచ్చని వివరించారు. దేశ వ్యాప్తంగా పలు కంపనీలలో తెలుగు యువత వివిధ రకాల జాబుల్లో స్థిరపడ్డారు అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన ఫీజు రీఇంబర్స్ మెంట్ పధకం.
చదువుకు ఒక్క పిల్లవాడు కూడా దూరం కాకూడదు అనే ఉన్నత లక్ష్యంతో ఆయన తీసుకొచ్చిన ఈ పధకం ఇవాళ లక్షాలాది విద్యార్థులకు విద్యా దానం చేస్తోంది అనటం ఎవరు కాదనలేని సత్యం అని ఇవి రెడ్డి గారు ఉద్ఘాటించారు. ప్రమాదాల్లో, వివిధ రకాల అత్యవసర సమయాల్లో అవసరార్తుల కోసం ప్రవేశ పెట్టిన 108 సర్వీస్ దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని ఇతర రాష్ట్రాలు కూడా మనల్నే అనుసరించేలా చేసిన అంబులెన్స్ సర్వీస్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోవడం రాజశేఖర్ రెడ్డి గారి ఘనతే అని ఐవి రెడ్డి చెప్పారు. ఇవి కాకుండా తాగు నీరు, సాగు నీరు కోసం తన ప్రభుత్వం హయాంలో ఏ రైతు కన్నీరు పెట్టకూడదు అనే ఆశయంతో ఎన్నో ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత ఒక్క రాజశేఖర్ రెడ్డి గారిది మాత్రమే అని చెప్పారు.
ఇలా ఎన్నో ఎన్నెన్నో ప్రజా శ్రేయస్సు కోరే పధకాలు తీసుకొచ్చి వారి బాగు కోసం అహర్నిశలు పాటు పడిన జననేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారికి భారతరత్న ఇవ్వటం సముచితమని, ఇది తన వ్యక్తిగత డిమాండ్ కాదని, తెలుగువారు ప్రతి ఒక్కరి మనసులో ఉన్న ఆకాంక్షను ఇప్పుడు అవకాశం కుదిరింది కాబట్టి వారి తరఫున తాను వినిపించానని ఐవి రెడ్డి పేర్కొన్నారు.
-ఐవీ రెడ్డి,
గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,
ప్రకాశం జిల్లా.