Begin typing your search above and press return to search.

ఏపీ క‌బ‌డ్డీ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఐవీ రెడ్డి

By:  Tupaki Desk   |   11 Dec 2017 4:16 PM GMT
ఏపీ క‌బ‌డ్డీ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఐవీ రెడ్డి
X
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్ద‌లూరు ఇంచార్జీ ఐవీ రెడ్డికి మ‌రో విశిష్ట ప‌ద‌వి ద‌క్కింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర స‌ర్కిల్ క‌బడ్డీ అసోసియేష‌న్ అధ్యక్షుడిగా ఐవీ రెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఆంద్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల సర్కిల్ కబడ్డీ అసోసియేష‌న్ జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశ‌మై త‌మ సంఘం అధ్యక్షుడిగా ఐవీరెడ్డిని ఎన్నుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 13 జిల్లాల అధ్య‌క్ష‌ - ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శులు పాల్గొన్న ఈ స‌మావేశంలో క్రీడా అభివృద్ధికి - సంఘ బ‌లోపేతానికి ఐవీ రెడ్డి చేసిన కృషిని ప్ర‌శంసిస్తూ ఈ ఉన్న‌త స్థానాన్ని క‌ట్ట‌బెడుతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఐవీ రెడ్డి హ‌యాంలో మ‌రింత గుర్తింపు వ‌స్తుంద‌ని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర స‌ర్కిల్ క‌బడ్డీ అసోసియేష‌న్ అధ్యక్షుడిగా ఏక‌గ్రీవంగా ఎన్నిక‌యిన ఐవీరెడ్డి మాట్లాడుతూ త‌న‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన అసోసియేష‌న్‌ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ ప‌ద‌వి ఆధారంగా రానున్న రోజుల్లో క‌బ‌డ్డీ ఆట‌కు మ‌రింత గుర్తింపు ద‌క్కే విధంగా చేస్తాన‌ని హామీ ఇచ్చారు. కబడ్డీ ఆట‌గాళ్లు త‌మ క్రీడ‌ను మ‌రింతగా ఆరాధించే స్థాయికి తీసుకువెళ్లేందుకు విశేష కృషిచేస్తాన‌ని వెల్ల‌డించారు. ప్రతి క్రీడాకారుడికి అండగా ఉంటానని ఐవీ రెడ్డి ఈ సంద‌ర్భంగా హామీ ఇచ్చారు.

త‌ను చిన్న‌త‌నం నుంచి క్రీడ‌ల‌పై మ‌క్కువ‌తో...ఆట‌ల‌పోటీల్లో పాల్గొన్నాన‌ని గ‌త స్మృతుల‌ను ఐవీరెడ్డి ఈ సంద‌ర్భంగా గుర్తుచేసుకున్నారు.సాటి క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించాల‌నే ఉద్దేశంతో త‌న నియోజ‌క‌వ‌ర్గ‌మైన గిద్ద‌లూరులో గ‌త ఐదేళ్లుగా క్రికెట్ పోటీల‌ను నిర్వ‌హించాన‌ని వెల్ల‌డించారు. త‌న క్రీడా స్పూర్తిని - క్రీడాకారుల‌కు అండ‌గా నిలిచే త‌త్వాన్ని గుర్తించి ఇంత‌టి మ‌హ‌త్త‌ర బాధ్య‌తలు క‌ట్ట‌బెట్ట‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. ప్ర‌తి క‌బ‌డ్డీ క్రీడాకారుడికి అండ‌గా ఉంటాన‌న్నారు.

ఈ సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్రదేశ్ లోని అన్ని జిల్లాల సర్కిల్ కబడ్డీ అధ్య‌క్షులు ఐవిరెడ్డికి సన్మానం చేశారు. అనంతరం క్రీడా కోచ్ లకు - క్రీడాకారులకు బహుమతిగా టీ షర్ట్స్ బహుకరించారు ఈ కార్యక్రమంలో రాష్ట సర్కిల్ కబడ్డీ సెక్రటరీ ఏ.పి.రెడ్డి - రాష్ట సర్కిల్ కబడ్డీ చీప్ కొండా తిరుపతి రెడ్డి - అన్ని జిల్లాల సర్కిల్ కబడ్డీ ప్లేయర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.