Begin typing your search above and press return to search.
జగన్ తో లోకేష్ కు పోలికా:వైస్సార్సీపీ ఇన్ చార్జి
By: Tupaki Desk | 9 Oct 2016 9:40 AM GMTతండ్రి చేతిలో అధికారం ఉన్నది కదాని.. రాష్ట్రం మంత్రుల్ని ఇంటి పాలేర్లలా చూసుకునే అలవాటు ఉన్న నారా లోకేష్ పెద్దలను గౌరవించే సంస్కారం గురించి జగన్ కు పాఠాలు చెప్పడం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నదని ప్రకాశం జిల్లా గిద్దలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి అన్నారు. శిక్షణ శిబిరాల్లో రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని నానా మాటలు అనడమే కాకుండా, తన చర్యను సమర్థించుకునేందుకు నారా లోకేష్ ప్రయత్నించడం చాలా చిత్రంగా ఉన్నదని వ్యాఖ్యానించారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో.. జగన్మోహనరెడ్డి తను అప్పటికే ఎంపీగా , కీలక మైన ప్రజాప్రతినిధిగా బాధ్యతల్లో ఉన్నప్పటికీ కూడా.. ఏనాడూ సెక్రటేరియేట్ లో అడుగుపెట్టిన పాపాన పోలేదని, మంత్రులతో భేటీలు వేయడం చేయలేదని, ఐఏఎస్ అధికార్లను అడిగి పనులు జరిపించుకోలేదని ఆయన చెప్పారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న కాలంలో.. ఆ పదవికి గౌరవం పెంచేలాగానే జగన్ వ్యవహరించారని, అదే సమయంలో లోకేష్ మాత్రం తన తండ్రి ముఖ్యమంత్రి అయిన నాటినుంచి తన దందాలను ప్రారంభించారని ఆరోపించారు.
మంత్రులను తన వద్దకు పిలిపించుకుని మాట్లాడడం, వారికి తను దందాలకు పాల్పడుతున్న పనులను పురమాయించి, తక్షణ ఆ ఆబ్లిగేషన్లు చేయాల్సిందిగా ఆదేశించడం, ముఖ్యమంత్రిని మించిన అధికార కేంద్రంగా అవతరించి.. యావత్ వ్యవస్థను భ్రష్టు పట్టించడం ఇదంతా కూడా లోకేష్ కే చెల్లిందని అలాంటి లోకేష్.. జగన్ కు నీతులు చెప్పడం చిత్రగా ఉన్నదని దెప్పి పొడిచారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/