Begin typing your search above and press return to search.
కలకలంగా మారిన ఇవాంక డౌట్.. మెలనియా ఫస్ట్ లేడీ కాదా?
By: Tupaki Desk | 18 Jun 2020 9:50 AM GMTఅమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ లాంటి మహానుభావుడు ఎన్నిక అవుతారని పదేళ్ల క్రితం ఎవరైనా చెబితే పిచ్చోళ్లను చూసినట్లు చూసే వారు. కానీ.. అమెరికన్లలో వచ్చిన మార్పు.. ఇతరత్రా కారణాలతో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక కావటమేకాదు.. మరోసారి ఎన్నిక అయ్యేందుకు వీలుగా పావులు కదపటం తెలిసిందే. ఆయన వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు..వ్యాపార.. రాజకీయ జీవితాలన్ని బోలెడన్ని వివాదాలతో నిండి ఉంటాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ట్రంప్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ.. ప్రభుత్వంలో తన హవా సాగిస్తున్న అతి కొద్దిమందిలో ట్రంప్ కుమార్తె ఇవాంక ఒకరు. ఇప్పటికే ఆమెకు సంబంధించిన బోలెడన్ని కబుర్లు మీడియాలో వచ్చాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా మెలనియా జీవిత చరిత్రను రాశారు వాషింగ్టన్ పోస్టు రిపోర్టర్ మేరీ జోర్డాన్.
ది ఆర్ట్ ఆఫ్ హర్ డీల్ అనే పుస్తకంలో ఆమె మెలనియాకు సంబంధించి బోలెడన్ని ఆసక్తికర అంశాల్ని పేర్కొన్నారు. ఇందులోనే మరో సంచలన విషయం బయటకు వచ్చింది. మెలనియాకు దక్కాల్సిన ఫస్ట్ లేడీ టైటిల్ ను మెలనియాకు దక్కకుండా ట్రంప్ మొదటి భార్య కుమార్తె అయినా ఇవాంక ప్రయత్నించినట్లుగా అందులో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడి భార్యను ఫస్ట్ లేడీ అని పిలవటం తెలిసిందే. అంతేకాదు.. వైట్ హౌస్ లో ఫస్ట్ లేడీస్ ఆఫీస్ కూడా ఉంటుంది.
అయితే.. మెలనియా ట్రంప్ కు మూడో భార్య కావటంతో.. తన తల్లికి దక్కాల్సిన ఫస్ట్ లేడీ టైటిల్.. మారుతల్లికి దక్కటాన్నిజీర్ణించుకోలేకపోయారట. దీంతో.. ఆమెకు ఫస్ట్ లేడీ టైటిల్ దక్కకుండా ఒక దశలో పావులు కదిపినట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఈ ప్రయత్నాన్ని మెలనియా అడ్డుకున్నారనిఈ పుస్తకంలో పేర్కొన్నారు. అంతేకాదు.. ఇదే బుక్ లో ఇవాంకను సింగిల్ మోస్ట్ ఇన్ ఫ్లుయెన్షియల్ అడ్వయిజర్ గా అభివర్ణించారు. ఈ కొత్త పుస్తకంలో వర్ణనలు అన్ని అవాస్తవాలే కానీ నిజాలేమీ లేవన్న మాట వినిపిస్తోంది. మొత్తానికి ఈ పుస్తకం కొత్త చర్చకు తావిచ్చిందని చెప్పక తప్పదు. రానున్న రోజుల్లో మరెన్ని కొత్త విషయాలు బయటకు వస్తాయో?