Begin typing your search above and press return to search.

మన యాంకర్ల కన్నా ఇవాంక డ్రెస్ చీప్

By:  Tupaki Desk   |   25 Feb 2020 6:45 AM GMT
మన యాంకర్ల కన్నా ఇవాంక డ్రెస్ చీప్
X
అగ్రరాజ్యానికి అధ్యక్షుడు తండ్రి.. అమెరికా ప్రథమ మహిళ కుమార్తె ఆమె.. అయినా సాదాసీదాగా.. హుందాగా ట్రంప్ దంపతుల కుమార్తె ఇవాంకా ట్రంప్ ఉంటుంది. పొడుగుకాల సుందరిగా ఉన్న ఇవాంకా తాజాగా భారత పర్యటనకు ఈసారి కుటుంబంతో కలిసి వచ్చింది. తల్లిదండ్రులు డొనాల్డ్ ట్రంప్, మెలానియాతో కలిసి ఇవాంక భారత్ కు రాగా.. అందరి దృష్టి ఆమె పైనే పడింది. గతంలో తెలంగాణలోని హైదరాబాద్ లో పర్యటించిన సమయంలో అందరినీ ఆకట్టుకున్న ఆమె ఈసారి అహ్మదాబాద్ పర్యటనలోనూ ఆకట్టుకుంది. అయితే ఇవాంక ఎరుపు పూల డ్రెస్ వేసుకుని మందార పూవుగా కనిపించింది.

అయితే ఆమె ధరించిన డ్రెస్ ఖరీదు.. మన యాంకర్ల కన్నా తక్కువ ధర ఉండడం గమనార్హం. ఫ్యాషన్ కు మారుపేరుగా నిలిచే ఇవాంక కొత్త కొత్త తరహా దుస్తులు వేసుకుని ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. ఆమె వేసుకునే దుస్తులు ఆమెను మరింత అందంగా చూపిస్తాయి. ఇవాంక ట్రంప్ సోమవారం ఎర్ర పూల గౌను వేసుకుని హొయలు ఒలికించింది. ఈ డ్రెస్ అమెరికాలోని ప్రొయేంజా షూలర్ అనే బ్రాండ్ కు చెందినది. లేత నీలి రంగుపై ఎర్ర పూలతో గౌన్ డిజైన్ చేసి ఉంది. దీని ఖరీదు కేవలం రూ.లక్షా 70 వేలు. ఈ డ్రెస్ ను రెండోసారి ధరించారు. గతంలో 2019 సెప్టెంబర్ లో అర్జెంటీనా పర్యటన సమయంలో ఈ గౌన్ ధరించారు. ఆ తర్వాత మళ్లీ భారత్ లో ఆ గౌన్ వేసుకుని అందంగా కనిపించారు.

అయితే ఆమె డ్రెస్ కేవలం రూ.రెండున్నర లక్షలే ఉండడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ కుమార్తె ఇవాంకా తన తక్కువ ధర డ్రెస్ వేసుకోవడం ఆమె సాధారణ జీవితం గురించి తెలుపుతుంది. ప్రస్తుతం మన తెలుగు యాంకర్లే ప్రత్యేక కార్యక్రమాలకు కాస్ట్లీ డ్రెస్సులు వేస్తుంటారు. హీరోయిన్స్ అయితే ఆ డ్రెస్ ల ధరలు భారీగానే ఉంటాయి. వీరితో పోలిస్తే అమెరికా అధ్యక్షుడి కుమార్తెగా ఉన్న ఇవాంక ట్రంప్ లక్షన్నర డ్రెస్ వేసుకోవడం ఆమె హంగుఆర్బాటాలకు వెళ్లకుండా సాదాసీదగా జీవితం గడుపుతారని తెలుస్తోంది.

ఇవాంక ట్రంప్ తల్లి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కూడా భారత పర్యటనలో సాధారణంగా కనిపించారు. తెల్లని జంప్ సూట్ కు నడుముకు బంగారం అంచు ఉన్న ఆకుపచ్చని కండువా కట్టుకున్నారు. ఈ డ్రెస్ ను ఫ్రెంచ్, అమెరికన్ డిజైనర్ హెర్వ్ పియరీ రూపొందించారు. ఆ డ్రెస్ లో తెల్లని కలువ పూవులా ట్రంప్ వెంట నడిచారు.