Begin typing your search above and press return to search.

ట్రంప్ టూర్: ఇవాంక డ్రెస్ అదుర్స్.!

By:  Tupaki Desk   |   24 Feb 2020 9:24 AM GMT
ట్రంప్ టూర్: ఇవాంక డ్రెస్ అదుర్స్.!
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో దిగిపోయారు. అహ్మాదాబాద్ లోని మోతేరా స్డేడియంలో 1.20 లక్షల మందిని ఉద్దేశించి ప్రసంగించేశారు. మోడీ - ట్రంప్ ఇద్దరి ప్రసంగంలోనూ ట్రంప్ కూతురు ఇవాంక గురించి ప్రస్తావన వచ్చింది. ఆమెను ప్రత్యేకంగా కొనియాడారు.

భారత పర్యటనలో ట్రంప్ కూతురు ఇవాంక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె భారతీయ వస్త్రధారణతో ఆకట్టుకుంది. ఎరుపు పూలతో తెల్లటి డ్రెస్ లో ఇవాంక మెరిసిపోయింది.

బౌవుడ్ నెక్ లైన్ తో పప్పుడ్ స్లీవ్స్ తో ఎర్రటి పూలు పొదిగిన ఇవాంక ఆ డ్రెస్ లో అందంగా కనిపించింది. బాగా హైట్ ఉండే ఇవాంక ఇంకా హైహీల్స్ ధరించి మరింత ఎత్తుగా కనిపించింది.

మోతేరా స్డేడియంకు వచ్చిన ఇవాంకతో ఫొటోలు - సెల్పీలు దిగడానికి జనాలు ఎగబడ్డారు. 14 ఏళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన మేగజైన్ కవర్లపై కూడా కనిపించింది. మిస్ టీన్ పోటీల్లోనూ పాల్గొంది. అందాల రాశి ఇవాంక ట్రంప్ టూర్ లోనే ప్రత్యేకంగా కనిపించింది.