Begin typing your search above and press return to search.

కోదండరాంకు ఇవాంకా షాక్ త‌గిలిందిగా

By:  Tupaki Desk   |   23 Nov 2017 7:20 AM GMT
కోదండరాంకు ఇవాంకా షాక్ త‌గిలిందిగా
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంక ట్రంప్ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న అనేక ట్విస్టుల‌కు వేదిక‌గా మారింది. ఇప్ప‌టికే బిచ్చ‌గాళ్ల త‌ర‌లింపు, న‌గ‌రంలోని స్థానికుల‌ను వారి నివాసాల నుంచి బ‌య‌ట‌కు రానివ్వ‌ని ఆదేశాలు ఉన్న నేప‌థ్యం హైద‌రాబాదీల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ఉద్య‌మాల‌కు సైతం ఇవాంకా షాక్ త‌గులుతోంది. అందులోనూ తెలంగాణ ఉద్య‌మంలో ముందుండి న‌డిచిన టీజేఎసీ చైైర్మెన్‌ కోదండరాం సైతం ఇవాంకా కార‌ణంగా ఇరకాటంలో ప‌డ్డారు. ఆయ‌న ప్ర‌తిష్టాత్మ‌క పోరాటానికి ఇవాంకా ప‌ర్య‌ట‌న ట్విస్ట్ ఇచ్చింది.

ఈనెల 30న హైద‌రాబాద్‌ లో తలపెట్టిన కొలువుల కొట్లాటకు ఇవాంకా రూపంలో మరో అడ్డంకి వచ్చింది. ఈ నెల 28నుంచి జరిగే గ్లోబెల్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌ సమ్మిట్‌ కు ఇవాంకా ముఖ్య అతిథిగా హాజరవుతున్న విషయం తెలిసిందే. ఆమె ఈ నెల 30 వరకు హైదరాబాద్‌ లో ఉండనున్నారు. అదే సమయంలో ఈ నెల 30న కొలువులకై కోట్లాట సభ నిర్వహించాలని జేఏసీ భావించింది. అయితే జీఈఎస్‌కు ఇవాంకా హైదరాబాద్‌ కు వస్తుండడంతో, ఈ నెల 30న తలపెట్టిన కొలువుల కొట్లాట సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సదస్సును వాయిదా వేసుకొని డిసెంబర్‌ 6న నిర్వహించుకోవాలని జేఏసీకి పోలీసు శాఖ సూచించింది.ఈ మేరకు పోలీసుల నుంచి అనుమతి లభించకపోవడంతో జేఏసీ హైకోర్టును ఆశ్రయించింది.

జేఏసీ పిటిష‌న్ పై హైకోర్టులో వాద‌నలు సాగాయి. ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ - అమెరికా అధ్యక్షుడి స‌ల‌హాదారుతో పాటు పలువురు అంతర్జాతీయ ప్రముఖులు హైదరాబాద్‌కి అదే సమయంలో వస్తున్న కారణంగా భద్రత కారణాల దష్ట్యా సభకు అనుమతి ఇవ్వడం కుదరదని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది.