Begin typing your search above and press return to search.
ఆమె ఎంట్రీతో ట్రంప్ లో మార్పు వచ్చేసిందట
By: Tupaki Desk | 3 March 2017 4:59 AM GMTనోరు తెరిస్తే విరుచుకుపడటం. ఎప్పుడు.. ఎవరు టార్గెట్ అవుతారో తెలీకపోవటం. హద్దులు దాటుతున్న అసహనంతో అమెరికాతో పాటు.. ప్రపంచ ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ... అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వరం మారటం.. కాంగ్రెస్ ను ఉద్దేశించిన ఆయన చేసిన స్పీచ్ సాఫ్ట్ గా ఉండటం పెద్ద విశేషంగా మారింది. తెంపరి ట్రంప్ మాటలు అందరూ ఆమోదయోగ్యంగా ఉండేలా ఎందుకు ఉన్నాయి? ఎప్పటి మాదిరి విపక్షాలు.. మీడియాను టార్గెట్ చేయకుండా.. అందరిని కలుపుకుపోయేలా.. ఆయన ప్రసంగం ఉండటానికి కారణం ఏమిటి? దూకుడు స్వరం తగ్గి.. సమతుల్యంతో ట్రంప్ స్పీచ్ ఉండటానికి కారణం ఏమిటి? లాంటి ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ఈ ప్రశ్నలన్నింటికి ఒకేఒక్క సమాధానం ''ఇవాంకా'' అని చెబుతున్నారు. విధానాల విషయంలో వెనక్కి తగ్గకున్నా.. స్పష్టత బాగా పెరగటం.. దూకుడు తగ్గినట్లుగా కనిపించటం వెనుక ట్రంప్ కుమార్తె ఎంట్రీ ఇవ్వటమే కారణంగా చెబుతున్నారు. కాంగ్రెస్ ను ఉద్దేశించి తన తండ్రి చేసే ప్రసంగానికి సంబంధించిన వ్యూహంలో ఇవాంకా పాల్గొనటమే కాదు.. కొన్ని సూచనలతో ప్రసంగాన్ని మార్చిందని.. అది వర్క్ వుట్ అయ్యిందని చెబుతున్నారు.
కూతురు ఇవాంకా ఐడియాకు ట్రంప్ ఓకే చెప్పటం.. తర్వాత దానికి మంచి ప్రశంసలు, అభినందనలు రావటంతో.. ఇవాంకా ప్లాన్ వర్క్ వుట్ అయినట్లుగా భావిస్తున్నారు. దీనిని బట్టి రానున్న రోజుల్లో ఇవాంకా కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అధ్యక్ష ఎన్నికలపుడు కూడా ఇవాంకా, ఆమె భర్త ప్రచార శైలిలో కీలకపాత్ర పోషించటాన్ని మర్చిపోలేం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్ అనధికార సలహాదారుగా ఇవాంకా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడిగా విజయం సాధించిన తర్వాత ఆమె తన వ్యాపారాల్ని పక్కన పెట్టేసి.. న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ కు షిఫ్ట్ కావటమే కాదు.. ట్రంప్ కార్యకలాపాల్లో ప్రముఖంగా కనిపిస్తుండటం గమనార్హం. తన తండ్రి స్పీచ్ ను మార్చటంలో కీలకపాత్ర పోషించిన ఇవాంకా రానున్న రోజుల్లో మరెన్ని కీలకపాత్రల్ని పోషిస్తారో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/