Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌ కు బై బై చెప్పేసిన ఇవాంక‌

By:  Tupaki Desk   |   30 Nov 2017 4:51 AM GMT
హైద‌రాబాద్‌ కు బై బై చెప్పేసిన ఇవాంక‌
X
ప్ర‌పంచానికి పెద్ద‌న్న అమెరికా అధ్య‌క్షుల వారి గారాల‌ప‌ట్టి ఇవాంక ట్రంప్ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న మీద సాగిన చ‌ర్చ అంతా ఇంతా కాదు. రెండు రోజుల పాటు ఏ మీడియాలో చూసినా ఇవాంకనే. ఆమె పుణ్య‌మా అని చాలా వార్త‌లు క‌వ‌ర్ కాకుండా పోయాయి. ప్రాధాన్య‌త కోల్పోయాయి. ఆమె కూర్చున్న ద‌గ్గ‌ర నుంచి విశ్ర‌మించే వ‌ర‌కూ జ‌రిగిన ప్ర‌తి విష‌యాన్ని క‌వ‌ర్ చేసిన మీడియా ఇప్పుడు రెస్ట్ తీసుకోవ‌చ్చు.

ఇవాంక టూర్ సంద‌ర్భంగా మీడియా మాత్ర‌మే కాదు తెలంగాణ ప్ర‌భుత్వం సైతం చాలానే శ్ర‌మించింది. ఆమె రాక నేప‌థ్యంలో హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రాన్ని స‌రికొత్త‌గా అలంక‌రించిన తెలంగాణ రాష్ట్ర అధికారులు సామాన్యుల‌కు షాకుల మీద షాకులు ఇచ్చారు. తాము త‌లుచుకుంటే హైద‌రాబాద్ ను ఎంత‌లా మార్చ‌గ‌ల‌మ‌న్న విష‌యాన్ని చెబుతూనే.. త‌మ‌కు సామాన్యులు ప‌ట్ట‌ర‌ని.. ఎక్క‌డో అమెరికా అధ్య‌క్షుడు కూతురు వ‌స్తుందంటే మాత్ర‌మే తాము స్పందిస్తామ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇవాంక టూర్ సంద‌ర్భంగా రోడ్లు.. ఫ్లైఓవ‌ర్లు.. ఇలా ఒక‌టేమిటి.. ఆమె ప్ర‌యాణించే మార్గాల‌న్నీ స‌ర్వాంగ సుంద‌రంగా త‌యారు చేశారు. అధికారుల కంటి నిండా కునుకు తీయ‌కుండా శ్ర‌మించారు. వారి క‌ష్టానికి త‌గ్గ‌ట్లే ఇవాంక రావ‌టం.. ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా ప‌నులు పూర్తి కావ‌టం జ‌రిగిపోయాయి. రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో బిజీబిజీగా గ‌డిపిన ఇవాంక బుధ‌వారం రాత్రి దుబాయ్ వెళ్లిపోయారు.

మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున హైద‌రాబాద్‌లో అడుగు పెట్టిన ఇవాంక‌.. రెండు రోజుల పాటు జీఈఎస్ కు హాజ‌ర‌య్యారు. కేంద్ర‌.. రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇచ్చిన విందుకు హాజ‌రైన ఆమె.. గోల్కొండ కోట‌ను సంద‌ర్శించారు. తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు ఏర్పాటు చేసిన విందులో.. తెలంగాణ వంట‌కాల్ని రుచి చూశారు. త‌న గోల్కొండ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా బ్యాట‌రీ కారు వాడ‌కుండా.. న‌డ‌క‌ను ఎంచుకున్న ఆమె దాదాపు అక్క‌డ 40 నిమిషాలు గ‌డిపారు. విందు అనంత‌రం తాను బ‌స చేసిన హోట‌ల్‌ కు వెళ్లిన ఇవాంక త‌ర్వాత శంషాబాద్‌ కు వెళ్లి.. అక్క‌డ నుంచి దుబాయ్ బ‌య‌లుదేరి వెళ్లిపోయారు. దీంతో.. ఇవాంక హ‌డావుడికి బ్రేక్ ప‌డిన‌ట్లే.