Begin typing your search above and press return to search.
అడ్డంగా బుక్ అయిన ట్రంప్ కూతురు
By: Tupaki Desk | 26 July 2017 5:19 AM GMTతెలిసీ తెలియని విషయాల్లోకి తల దూర్చటం ఎంత తప్పన్న విషయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముద్దుల కుమార్తె ఇవాంకా ట్రంప్ కు బాగా తెలిసి వచ్చి ఉంటుంది. ఏదో అనుకొని ఏదో చేస్తే.. మరేదో అయినట్లుగా ఇవాంకా పరిస్థితి తాజాగా అలానే అయ్యింది. అప్పుడెప్పుడో నాలుగేళ్ల క్రితం అవగాహన లేకుండా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బయటకు వచ్చి.. అమ్మడి మేధోతనంపై క్వశ్చన్ మార్కు పడేలా చేసిందని చెబుతున్నారు.
ఇవాంకా తప్పులో కాలేసిన తీరుపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మామూలుగా అయితే ఇవాంకా ముచ్చట పెద్దగా ఫోకస్ అయ్యేది కాదు. కానీ.. ఇప్పుడామె అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె కావటం.. పాలనలో జోక్యం చేసుకుంటున్న నేపథ్యంలో అమ్మడి మేధోతనం ఎంతన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు వీలుగా ఉండటంతో దీనికి మరింత ప్రచారం లభించింది. దాదాపు నాలుగేళ్ల క్రితం (ఇంకా సరిగ్గా చెప్పాలంటే 2013 జూన్ 23న) ఇవాంకా ఒక ట్వీట్ చేశారు. ప్రముఖ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్ స్టీన్ థియరీ అంటూ ఉదహరిస్తూ ఒక విషయాన్ని చెబుతూ.. ఒకవేళ నిజాలు థియరీలకు మ్యాచ్ కాకపోతే.. ఆ నిజాలనే మార్చివేయాలని సదరు శాస్త్రవేత్త కోట్ చేసినట్లుగా అమ్మడు పేర్కొన్నాడు.
అయితే.. అలాంటి కోట్ ఏదీ ఐన్ స్టీన్ చేయలేదన్న విషయాన్ని తాజాగా తేలుస్తూ.. రీట్వీట్ చేశారు సదరు శాస్త్రవేత్త పేరిట ఉన్న అధికారిక ట్విట్టర్ ఖాతా సభ్యులు. దీంతో.. అవగాహన ఉంటే కొటేషన్లు కోట్ చేయాలే తప్పించి.. ఇష్టం వచ్చినట్లుగా ట్వీట్లు ఎలా చేస్తారంటూ నెటిజన్లు అమ్మడి మీద మండిపడుతున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటివి మరెన్ని వెలుగు చూస్తాయో? ఎందుకైనా మంచిది గతంలో అమ్మడు తాను చేసిన ట్వీట్లను ఒక్కసారి చెక్ చేసుకుంటే మంచిదేమో?