Begin typing your search above and press return to search.
వరల్డ్ బ్యాంక్ అధ్యక్షురాలిగా ఇవాంకా ట్రంప్
By: Tupaki Desk | 13 Jan 2019 1:53 PM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారాలపట్టి ఇవాంక ట్రంప్ పేరు మరోమారు ఆసక్తికర ఎపిసోడ్ తో తెరమీదకు వస్తోంది. అత్యంత శక్తివంతమైన ప్రపంచ బ్యాంకు అధ్యక్షురాలిగా ఇవాంకా ట్రంఫ్ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ వచ్చేవారం బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. దీంతో ఇవాంకా పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ప్రస్తుత సభ్యుల్లో మెజార్టీ మంది ఆమెకు మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. దీంతో ప్రపంచబ్యాంక్ తదుపరి చీఫ్‌గా ఇవాంక ఖరారు కావడం లాంచన ప్రాయమేనని అంటున్నారు.
వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా కిమ్ ను 2011లో బరాక్ ఒబామా ఈ పదవికి ఎంపిక చేశారు. తిరిగి 2016లో ఎన్నికైన కిమ్, పదవీకాలం ముగియక ముందే వైదొలగాలని నిర్ణయించారు. ఈయన స్థానంలో కొత్త చీఫ్‌ను ట్రంప్ ఎంపిక చేయనున్నారు. ఐఎంఎఫ్ చీఫ్ రేసులో ఇవాంక తోపాటు ట్రెజరీ అధికారి డేవిడ్ మల్ పాస్ - ఐరాసలో అమెరికా మాజీ ప్రతినిధి నిక్కీహేలీ - అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ చీఫ్ మార్క్ గ్రీన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఐఎంఎఫ్ అధిపతి ఎంపిక నిర్ణయంలో ప్రధాన వాటాదారులైన అమెరికా - యూరప్ దేశాలు కీలకం కానున్నాయి. అయితే, యూరప్ దేశాలు ఇవాంకాకు మద్దతివ్వనున్నట్లు తెలుస్తోంది. ఇవాంకాకు మద్దతుగా ఇప్పటికే పలు రకాలైన ప్రచారం అమెరికాలో జోరుగా సాగుతోంది. మహిళ వ్యాపారవేత్తల సాధికారత కోసం 2017లో ఇవాంకా ట్రంప్ భారీగా నిధులు సేకరించారు. సుమారు వంద కోట్ల డాలర్ల నిధులను ఆమె సేకరించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ అంశాల ఆధారంగా ఇవాంకా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ నామినేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రపంచ దేశాల పునర్నిర్మాణం - అభివృద్ది బ్యాంకుగా పిలువబడే ప్రపంచ బ్యాంకు 1944లో ఏర్పాటైంది. రెండవ ప్రపంచ యుద్ధంలో దెబ్బతిన్న దేశాల పునర్నిర్మాణం లక్ష్యంగా దీన్ని స్థాపించారు. ప్రస్తుతం వరల్డ్ బ్యాంకులో 180 దేశాలు సభ్యత్వం కలిగివున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక, సాంకేతిక సహాయం అందించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తోంది. వరల్డ్ బ్యాంక్ లో ఎక్కువ శాతం షేర్లు అమెరికావే. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు అయిన ఆ బ్యాంక్‌కు అమెరికా ప్రతిపాదించిన వ్యక్తులే అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే, ప్రపంచబ్యాంకుపై అమెరికా పెత్తనంపై విమర్శల స్వరం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ జాబితాలో చైనా ముందుంది. 2011లో బోర్డు తీసుకొచ్చిన బహిరంగ, మెజార్టీ ఆధారిత - పారదర్శక ప్రక్రియను డ్రాగన్ ఆక్షేపించింది. ముగ్గురికంటే ఎక్కువ మంది బరిలో ఉంటే, ఓటింగ్ పద్దతిలో పోటీదారుల సంఖ్యను కుదించడం, మిగతా వారికి ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా బోర్డు కొత్త చీఫ్‌ను ఎంపిక చేస్తుంది.