Begin typing your search above and press return to search.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు అలా వచ్చిన ఇవాంక
By: Tupaki Desk | 28 Nov 2017 3:56 AM GMTకొద్దిరోజులుగా తెలుగు వారికి హాట్ టాపిక్ గా మారిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె హైదరాబాద్ టూర్ మొదలైంది. మీరీ వార్త చదివే సమయానికి ఆమె హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్లో సేద తీరుతూ ఉంటారు. హైదరాబాద్ ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న వేళలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న ఇవాంక.. తనకు స్వాగతం పలకటానికి వచ్చిన అమెరికా.. తెలంగాణ రాష్ట్ర అధికారులతో హుషారుగా గడిపారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఇవాంక తన రెగ్యులర్ వస్త్రధారణకు భిన్నంగా బయటకు రావటం పలువురి దృష్టిని ఆకర్షించింది. మోడ్రన్ డ్రెస్సింగ్ తో ఉండే ఇవాంక.. హైదరాబాద్‌కు వస్తున్న సందర్భంగా ఆమె జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కనిపించింది.
బ్లాక్ కలర్ ఫ్యాంట్.. బ్లాక్ కలర్ షర్ట్ ను ధరించారు. ఆపై బ్లాక్ కలర్ పుల్ హ్యాండ్స్ కోట్ పై వైట్ కలర్ డిజైన్ ఉండే వస్త్రధారణతో ఆమె ఎయిర్ పోర్ట్ బయటకు వచ్చారు. వైట్ కలర్ బ్యాగ్ ను చేతపట్టుకొని వచ్చారు. డ్రెస్సింగ్ విషయంలో ఆమె జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కనిపించక మానదు.
నిండైన వస్త్రధారణతో బయటకు వచ్చిన ఇవాంకను చూసినంతనే తాను వస్తున్నది హైదరాబాద్ అన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని వచ్చినట్లుగా కనిపించక మానదు. వాస్తవానికి హైదరాబాద్ ట్రెండీగా ఉండేలా వస్త్రధారణతో పలువురు వచ్చినా.. ఇక్కడి ప్రజల సంప్రదాయాలు.. సంస్కృతి పట్ల అవగాహన ఉందన్న సంకేతాన్ని ఇచ్చేలా ఆమె వస్త్రధారణ ఉండటం గమనార్హం. ఏమైనా బ్లాక్ అండ్ బ్లాక్ లో డ్రెస్ లో అడుగుపెట్టిన ఇవాంక అదరగొట్టారనే చెప్పాలి.