Begin typing your search above and press return to search.
హైదరాబాద్ పై మళ్లీ మనసు పారేసుకున్న ఇవాంకా
By: Tupaki Desk | 27 July 2018 4:00 AM GMTఅగ్రరాజ్యం అమెరికా అధిపతి డొనాల్డ్ ట్రంప్ తనయ ఇవాంకా ట్రంప్ కు హైదరాబాద్ తెగ నచ్చేసినట్లుంది. గత ఏడాది హైదరాబాద్ వేదికగా జరిగిన గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ కు ఇవాంకా ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఇవాంకా ట్రంప్ తో ప్రధాని మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవం తర్వాత నేరుగా హెచ్ ఐసీసీకి వెళ్లిన మోడీ.. మొదట ఇవాంకాతో సమావేశమయ్యారు. ఇవాంకా - మోడీతోపాటు రెండు దేశాల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇవాంకా అంతకుముందు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తోనూ భేటీ అయ్యారు. జీఈఎస్ లో మొదటి రోజు సదస్సుకు వచ్చిన ప్రతినిధులను ఉద్దేశించి ఇవాంకా మాట్లాడారు. మహిళలు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే విధంగా తమ ప్రభుత్వం విధానాలను రూపొందిస్తోందని ఇవాంకా ఆ ప్రసంగంలో పేర్కొన్నారు. వర్క్ ఫోర్స్ - స్కిల్ డెవలప్ మెంట్ కోసం అమెరికా ప్రభుత్వం అనేక విధానాలను అమలు చేస్తున్నదని ఆమె అన్నారు. తమ కలలను తమ భవిష్యత్తుగా మార్చుకునేందుకు మహిళా వ్యాపారవేత్తలకు సహాకారం అందిస్తున్నామని ఇవాంకా ఆ ప్రసంగంలో తెలిపారు.
దీంతో పాటుగా రెండవ రోజు జీఈఎస్ సదస్సులో భాగంగా ఇవాళ ప్లీనరీ జరిగింది. దానికి మంత్రి కేటీఆర్ మాడరేటర్ గా వ్యవహరించారు. ఈ ప్లీనరీ లో ప్యానలిస్టులుగా ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చార్ - ఇవాంకా ట్రంప్ - బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ - డెల్ ఈఎంసీ కరేన్ క్వింటోస్ లు ఉన్నారు. ఈ చర్చలో భాగంగా మొదట ఐసీఐసీఐ సీఈవో చందా కొచ్చార్ ను మంత్రి కేటీఆర్ వేదిక మీదకు ఆహ్వానించారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్ ను కూడా మంత్రి ఆహ్వానించారు. అయితే ఇవాంకాను పరిచయం చేసే సమయంలో మంత్రి కేటీఆర్ కొంత చమత్కారాన్ని ప్రదర్శించారు. తాను రాష్ర్టానికి ఐటీ మంత్రిని అని - కొన్ని రోజులుగా హైదరాబాద్ లో ఐటీ నామస్మరణ జరుగుతున్నదని - ఐటీ అంటే `ఇవాంకా ట్రంప్` అని మంత్రి కేటీఆర్ నవ్వులు పూయించారు.
ఇలా సరదాగా ఆమె పర్యటన సాగింది. అందుకే ఆమె మదిలో హైదరాబాద్ నిలిచిపోయినట్లుంది. ఇందుకు తార్కాణం తాజాగా వెలుగులోకి వచ్చిన అంశం. ఇటీవల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో ఏర్పాటు ఎకనామిక్ బిజినెస్ అడ్వైజరీ సమావేశానికి ట్రంప్ తనయ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా రిజర్వ్ చేసిన జాబితా ప్రకారం ఆమె విందు ఆసీనులయ్యే టేబుల్ లోనే ప్రఖ్యాత అడోబ్ సంస్థ సీఈఓ శంతను నారాయణ కూడా కూర్చున్నారు. ఈ సందర్భంగా పరిచయ కార్యక్రమంలో తనను హైదరాబాదీగా శంతను పరిచయం చేసుకోగా...ఇవాంకా ఎంతో ఉత్కంఠతో తన అనుభూతులను పంచుకున్నారు. ‘గత ఏడాది మీ సొంత నగరం హైదరాబాద్ వెళ్లాను. జీఈఎస్ కు వారు ఇచ్చిన ఆతిథ్యం బాగుంది. అత్యంత సుహృద్భావ వాతవరణం - చక్కటి సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ చక్కటి ఆతిథ్యం - అందమైన కట్టడాలు - సౌందర్యానికి నెలవు’ అని కొనియాడారు. దీంతో పాటుగా పలు అంశాలు ఆమె చర్చించారు. కాగా, తెలంగాణ రాష్ట్ర రాజధానికి దక్కిన ఈ ప్రశంసను హైదరాబాదీ అయిన శంతను నారాయణ ఇటీవల రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ - ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తో పంచుకున్నారు. చూస్తుంటే..హైదరాబాద్ కు ఇవాంకా బాగా కనెక్ట్ అయినట్లున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.