Begin typing your search above and press return to search.
ట్రంప్ మాటలపై కూతురు ఏమందంటే..
By: Tupaki Desk | 19 Oct 2016 10:06 AM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఇంత రచ్చరచ్చగా మారింది గతంలో లేదంటున్నారు పలువురు అమెరికన్లు. బరిలో ఉన్న ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులపైనా అసంతృప్తితో ఉన్న అమెరికన్లు.. తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారట. ఆరోపణలు.. విమర్శలు ఎదుర్కొంటున్ననేతలు రాబోయే రోజుల్లో తమను పాలించే వారా? అన్నది వారి ప్రశ్నగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ కంపు మాటలు అమెరికా వ్యాప్తంగా పెద్ద చర్చ సాగుతోంది. తాజాగా ఆయనకు సంబంధించి బయటకు వచ్చిన వీడియోలలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారటమే కాదు.. అమెరికన్ మహిళలు తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే.
తాను కానీ మరో 20 ఏళ్ల తర్వాత పుట్టి ఉంటే కచ్ఛితంగా తన కూతురుతో డేటింగ్ చేసి ఉండేవాడినంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. ఎనిమిదేళ్ల క్రితం ట్రంప్ అన్న మాటలకు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్న ఆయన్ను కట్టుకున్నపెళ్లాంతో పాటు.. తాజాగా కూతురుకూడా తప్పు పట్టారు. తనపై చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ కుమార్తె ఇవాంకా తొలిసారి స్పందించారు. తన తండ్రి అలా మాట్లాడటం తప్పేనని చెప్పిన ఆమె.. తండ్రి వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఒక ప్రకటనను విడుదల చేశారు.
తన తండ్రి అలా మాట్లాడటం తప్పేనని.. తన తండ్రి మాట్లాడిన వీడియో బయటకు వచ్చిన వెంటనే.. తన కుటుంబానికి.. అమెరికాకు సారీ చెప్పిన విషయాన్ని మర్చిపోకూడదని.. ఈ విషయంలో తన తండ్రి గురించి మీడియా కంటే తనకే ఎక్కువగా తెలుసన్న ఇవాంకా.. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని కోరారు. అంతేకాడు.. తన తండ్రిని తప్పుపట్టే క్రమంలో మీడియా మీదా ఆమె ఫైర్ అయ్యారు. ఇవాంకా.. ట్రంప్ కు సెరోగేట్ వైఫ్ అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేసిన మీడియాను ఏమనాలి? అంటూ.. బాధ్యత కలిగిన మీడియా ఇలా మాట్లాడొచ్చా? అంటూ ఆమె ఫైర్ అయ్యారు. మీడియా జరిపిన ప్రచారం తనను ఎంతగానో బాధ పెట్టిందని ఆమె వ్యాఖ్యానించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/